మహేష్ బాబు ఆల్ టైమ్ రికార్డ్.. సౌత్ ఇండియాలో ఏకైక హీరో !
సూపర్ స్టార్ మహేష్ బాబు.. హాలీవుడ్ హీరోల రేంజ్ లో కటౌట్.. హ్యాండ్సమ్ లుక్స్ తో ఇచ్చి పడేస్తారు. నేటితో 50వ వసంతంలోకి అడుగుపెడుతున్న బాబు.. ఏజ్ అనేది జస్ట్ నంబర్ మాత్రమే అనడానికి నిదర్శనంగా నిలుస్తారు. బాలనటుడిగానే ఎంట్రీ ఇచ్చి.. అందంలోనే కాకుండా.. నటనలోనూ తండ్రికి తగ్గ తనయుడు అని నిరూపించుకున్నారు. అంతే కాకుండా ఎంతో మంది చిన్నారులకు హార్ట్ ఆపరేషన్స్ చేయించి రియల్ హీరోగా కూడా నిలుస్తున్నారు.
ఫ్యామిలీ..
సూపర్ స్టార్ కృష్ణ, ఇందిరా దేవి దంపతులకు 1975 ఆగస్టు 9వ తేదీన జన్మించారు మహేష్. ఆయన అన్న రమేష్ బాబు కూడా హీరోగా సత్తా చాటారు. అలానే పద్మావతి, మంజుల, ప్రియదర్శిని అనే ముగ్గురు సోదరీలు ఉన్నారు.

బాలనటుడిగా ఎంట్రీ..
రమేష్ బాబు హీరోగా నటించిన 'నీడ' (1979) అనే చిత్రంతో తొలిసారిగా వెండితెరపై కనిపించారు మహేష్. అప్పుడు అయన వయస్సు కేవలం నాలుగేళ్లు మాత్రమే. అలానే కృష్ణ హీరోగా నటించిన పలు సినిమాల్లో కూడా నటించి మెప్పించారు. ఆ తర్వాత మధ్యలో కొంచెం గ్యాప్ తీసుకొని 1999 లో 'రాజకుమారుడు' మూవీతో హీరోగా మారారు. నాటి నుంచి విభిన్న కథాంశాలు, వైవిధమైన పాత్రలు పోషిస్తూ అంచెలంచెలుగా ఎదిగారు.
తన 25 ఏళ్ల సినీ కెరీర్ లో ఇప్పటి వరకూ 28 చిత్రాలతో నటించారు. నిర్మాతగానూ పలు సినిమాలను రూపొందించారు. ఈ క్రమంలో ఎన్నో అవార్డులు రివార్డులు సొంతం చేసుకున్నారు. ఉత్తమ నటుడిగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి 8 నంది పురస్కారాలను అందుకున్నారు. 5 ఫిలిం ఫేర్ అవార్డులతో సహా అనేక మరెన్నో పురస్కారాలను దక్కించుకున్నారు.
సోషల్ మీడియా రికార్డ్..
అటు సినిమాలతో పాటే పలు యాడ్స్ లో కూడా నటిస్తూ ఫుల్ బిజీగా ఉంటారు మహేష్ బాబు. అంతే కాకుండా సోషల్ మీడియాలో సైతం యాక్టివ్ గా ఉంటూ తన పర్సనల్, ప్రొఫెషనల్ విషయాలను పంచుకుంటుంటారు. కాగా ఫేస్‌బుక్, ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్.. ఒక్కో దానిలో కోటి మందికి పైగా ఫాలోవర్స్‌ను కలిగిన ఏకైక సౌత్ ఇండియన్ హీరో" గా కూడా నిలిచారు.
ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళితో ఒక మూవీ చేస్తున్నారు. ఈ మూవీలో మాలీవుడ్ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్, బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా కూడా నటిస్తున్నారు. SSMB29 అనే వర్కింగ్ టైటిల్ తో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది ఈ చిత్రం. ఈ మేరకు ఈ ఏడాది నవంబర్‌లో అప్ డేట్స్ విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఒక ఫోటోని కూడా పంచుకున్నారు. అలానే మేం సృష్టిస్తున్న ప్రపంచాన్ని మీకు చూపించేందుకు ప్రత్యేకంగా ఒక వీడియో సిద్ధం చేస్తున్నాం. ఇది ముందెన్నడూ చూడని విధంగా ఉంటుంది. మీ ఓపికకు ధన్యవాదాలు" అని జక్కన్న రాసుకొచ్చారు.
The First Reveal in November 2025… #GlobeTrotter pic.twitter.com/MEtGBNeqfi
— rajamouli ss (@ssrajamouli) August 9, 2025












Click it and Unblock the Notifications