మహేష్ బాబు వదులుకున్న బ్లాక్ బస్టర్ లవ్ స్టోరీ తెలుసా?
సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఎంత క్రేజ్ ఉంది అనే విషయానని ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పాన్ ఇండియా సినిమాలు చేయనప్పటికీ ఇమేజ్, క్రేజ్, సినిమా వసూళ్లు మాత్రం పాన్ ఇండియా రేంజ్ లోనే ఉంటాయి. అటువంటి స్టార్ హీరో దగ్గరకు కొన్ని కథలు వస్తుంటాయి. కాల్షీట్లు ఖాళీ లేకపోవడంతోనే, ఇతరత్రా కారణాలతోనో వాటిని చేయడానికి వీలుపడదు. చేయాలని ఎంత అనుకున్నప్పటికీ వివిధ కారణాలవల్ల వదులుకోవాల్సి ఉంటుంది.
తెలుగు సినీ పరిశ్రమలో ప్రేమకథా సినిమాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ఎన్నో ప్రేమకథల సినిమాలు అద్భుత విజయాన్ని సాధించాయి. ప్రేమకథా సినిమాలు అనగానే అందరికీ మణిరత్నం సినిమాలు గుర్తుకువస్తాయి. మణిరత్నం తర్వాత అంతటి స్థాయిలో ప్రేమకథలను తీయగలిగేది గౌతమ్ వాసుదేవ్ మీనన్. తన దర్శకత్వంలో వచ్చిన ఏమాయచేశావే సినిమా పెద్ద విజయాన్ని సాధించింది. ఈ కథ రాసుకున్న తర్వాత గౌతమ్ మీనన్ మహేష్ బాబు సోదరి మంజులకు వినిపించారు. ఆమె వెంటనే మహేష్ బాబుకు చెప్పమంది.

ఈ కథను వెంటనే గౌతమ్ మీనన్ మహేష్ బాబుకు చెప్పాడు. తామిద్దరి కాంబినేషన్ లో వచ్చే సినిమా భారీగా ఉండాలని, ఒక బిగ్ స్కేల్ లో ఉండాలని ప్రిన్స్ గౌతమ్ తో అన్నారు. అయితే గౌతమ్ మాత్రం కథను పూర్తిగా నమ్మారు. మనిద్దరం ఈ సినిమా చేస్తే ఇదే బిగ్ స్కేల్ అవుతుందన్నారు. తనకు ఆ నమ్మకం ఉందన్నారు. అయితే వివిధ కారణాలరీత్యా సినిమా మాత్రం పట్టాలెక్కలేదు. తర్వాత నాగచైతన్య హీరోగా ఈ సినిమా తెరకెక్కింది. తన కెరీర్ లోనే బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఒకవేళ మహేష్ బాబు ఈ సినిమాను చేసుంటే మాత్రం అద్భుతంగా ఉండదని, తన కెరీర్ లో మరపురాని చిత్రంగా నిలిచేదని ప్రిన్స్ అభిమానులు చర్చించుకుంటున్నారు.












Click it and Unblock the Notifications