అల్లు అరవింద్ తెలివితేటలు మహేష్‌బాబు దగ్గర పనిచేయలేదు
అల్లు అరవింద్ గురించి తెలుగు పరిశ్రమలోనే కాకుండా భారతీయ చిత్ర పరిశ్రమలో ప్రత్యేక పరిచయం అవసరంలేదు. ఏ హీరోతో, ఏ కథను, ఎంత బడ్జెట్ తో పొదుపుగా తెరకెక్కించాలో అల్లు అరవింద్ కు తెలిసినంతగా మరే నిర్మాతకు తెలియదంటే అతిశయోక్తికాదు. ఆయన ప్రాజెక్టు ప్రారంభించాడంటే కచ్చితంగా విజయవంతమవుతుందనే భావనలోనే అందరూ ఉంటారు. ఇటీవలికాలంలో ఆయన సినిమాలు ఫ్లాప్ అవడం అరుదు. మారుతున్న కాలానికి అనుగుణంగా, ప్రేక్షకులను అభిరుచులను పసిగడుతూ సినిమాలు తీసి విజయం సాధిస్తుంటారు.
అన్నీ కుదిరినప్పటికీ ఎందుకనో..
ప్రిన్స్ మహేష్ బాబు ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఓ పాన్ వరల్డ్ చిత్రాన్ని చేయబోతున్నారు. ఈ సినిమా మూడు భాగాలుగా రానున్నట్లు తెలుస్తోంది. తెలుగు సినిమాలను దాటి బయట ఎటువంటి సినిమాలను చేయననే మహేష్ బాబు ఇప్పుడు చేస్తున్న తెలుగు సినిమాతోనే అంతర్జాతీయ హీరోగా మారిపోతున్నారు. ప్రిన్స్ తో ఓ సినిమా చేయాలని అల్లు అరవింద్ ఎప్పటినుంచో ప్రయత్నించారుకానీ అనివార్య కారణాలతో కొన్ని ప్రాజెక్టులు తెరకెక్కలేదు. అయితే మహేష్ బాబుతో సినిమా చేయాలనే పట్టుదలతో ఉన్న అరవింద్ గట్టిగా ప్రయత్నించగా ఓ బాలీవుడ్ సంస్థతో కూడా ఒప్పందం కుదిరింది. తెలుగు వరకు బాధ్యతలు అరవింద్ తీసుకునేలా ఒప్పందం కుదిరింది. కథ ఓకే అయింది.

బన్నీ వాసు ఇంటర్వ్యూలో స్పష్టత
మహేష్ బాబు కోసం అనుకున్న కథతో సినిమా ప్రారంభమైందికానీ హీరో మాత్రం ప్రిన్స్ కాదు. రణబీర్ కపూర్, సాయిపల్లవి జంటగా రామాయణం చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. గతంలో ఓ ఇంటర్వ్యూలో అల్లు అరవింద్ ఈ విషయం చెప్పారు. తాజాగా నిర్మాత బన్నీవాసు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పిన విషయాల ప్రకారం రామాయణం చిత్రాన్ని మహేష్ బాబుతోనే తెరకెక్కించాలని అనుకున్నప్పటికీ కుదర్లేదని ఓ స్పష్టత వచ్చింది.
అల్లు అరవింద్ ఒప్పించలేకపోయారే
మహేష్ బాబుతో తీయాలనుకున్న సినిమాను రణబీర్ కపూర్ తో చేస్తున్నారని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మహేష్ బాబుతో సినిమా తీయాలనుకున్న అల్లు అరవింద్ కల మాత్రం అలాగే నిలిచిపోయిందని, భవిష్యత్తులోనైనా వీరి కాంబినేషన్ లో ప్రాజెక్టు తెరకెక్కుతుందేమో చూడాలని అంటున్నారు. రామాయణంలో రాముడి పాత్ర అనగానే ఒంటిపై చొక్కా లేకుండా సినిమా మొత్తం నటించాల్సి ఉంటుంది. అయితే వెండితెరపై ఇలా నటించేందుకు మహేష్ బాబు మొదటి నుంచి మొగ్గుచూపలేదు. ఈ కారణంతోనే ఈ సినిమాను ప్రిన్స్ తిరస్కరించివుండొచ్చని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. అల్లు అరవింద్ లాంటి మంచి తెలివితేటలున్న నిర్మాత కూడా మహేష్ బాబును ఒప్పించలేకపోయారంటున్నారు.












Click it and Unblock the Notifications