తెలుగులో మహేష్‌బాబు సంచలన రికార్డు... ఏ హీరోకైనా కష్టమే!
సూపర్ స్టార్ మహేష్ బాబు ఎన్ని అవకాశాలు వచ్చినా పాన్ ఇండియాలు సినిమాలుకానీ, హిందీలో సినిమాలుకానీ చేయలేదు. తెలుగులో మాత్రమే చేయాలనుకున్నారు. అందుకు కట్టుబడి సినిమాలు చేసి సూపర్ స్టార్ గా అవతరించారు. అయితే అలా అని రాజమౌళి లాంటి దర్శక ధీరులు ఊరుకోరుగా. అందుకే పాన్ ఇండియా వద్దులే పాన్ వరల్డ్ చేద్దామంటూ మహేష్ బాబును గట్టిగా పిండేయబోతున్నారు. రాజమౌళితో సినిమా అంటే కఠినంగా ఉంటుంది. నియమ నిబంధనలు కచ్చితంగా అమలు పరచాలి. సినిమా పూర్తయ్యేసరికి మహేష్ బాబు పరిస్థితిని ఊహించుకుంటేనే నవ్వొస్తోంది.
ఐదు సినిమాకు రూ.567 కోట్లు
ఎన్ని సినిమాలు చేస్తున్నా ఏ సినిమాలో విభిన్నంగా ఉండటానికి ప్రయత్నించకుండా ఒకే తరహాలు కనిపిస్తూ సినిమాలు చేస్తూ వస్తున్నారు. అందుకే రాజమౌళి మహేష్ బాబును పూర్తిగా మార్చేస్తున్నారు. టాప్ స్టార్ గా అవతరించిన ప్రిన్స్ గత ఐదు సినిమాలద్వారా తెలుగు హీరోలెవరికీ సాధ్యంకాని రికార్డులను సొంతం చేసుకున్నారు. భరత్ అనే నేను సినిమాద్వారా రూ.101 కోట్ల షేర్ రాబట్టారు. ఆ తర్వాత చేసిన మహర్షి సినిమాద్వారా రూ.105 కోట్ల షేర్ వచ్చింది. మహర్షి తర్వాత సరిలేరు నీకెవ్వరూ సినిమాకు రూ.139 కోట్ల షేర్, సర్కారువారిపాట సినిమాకు రూ.111 కోట్ల షేర్, గుంటూరు కారం సినిమాద్వారా రూ.112 కోట్ల షేర్ వచ్చింది. ఇలా వరుసగా ఐదు సినిమాలకు కలిపి రూ.567 కోట్ల షేర్ రాబట్టి సంచలన రికార్డును నెలకొల్పారు.

తనకున్న క్రేజ్ ద్వారానే సూపర్ హిట్లు చేశాడు
భరత్ అనే నేను, మహర్షి కాకుండా చివరి మూడు సినిమాలు మహేష్ బాబు స్థాయి సినిమాలు కాకపోయినా, ఆ సమయంలో అగ్ర దర్శకులెవరూ ఖాళీగా లేకపోవడంతో కొత్త దర్శకులతోనే సినిమాలు చేసి తనకున్న క్రేజ్ ద్వారా వాటిని సూపర్ హిట్లుగా మలిచారు. సర్కారువారిపాట యావరేజ్, గుంటూరు కారం ఫ్లాప్. అయినా వాటికి కూడా షేర్ వచ్చిందంటే మహేష్ బాబు క్రేజ్ తెలుగులో ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. తెలుగులో మరే హీరోకు ఈ రికార్డు సాధ్యంకాలేదు. ఇదంతా నాన్ బాహుబలి కేటగిరిలోనే. రాజమౌళితో చేస్తున్న సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ఎన్ని కోట్ల గ్రాస్ వసూళ్లు ఉంటాయో, ఎన్ని వందల కోట్ల షేర్ వస్తుందో చూడాలి. ఈ సినిమాను పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కిస్తున్నారు. హాలీవుడ్ లో కూడా భారీగా విడుదల చేయడానికి రాజమౌళి ప్లాన్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications