2 బ్లాక్ బస్టర్లు వదులుకున్న మహేష్ బాబు
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో గుంటూరు కారం సినిమా చేస్తున్నారు. ఈ సమయానికి షూటింగ్ మొత్తం పూర్తవ్వాల్సి ఉండగా అనుకోని కారణాలవల్ల ఇది వాయిదా పడుతూ రావడమేకాక పడుతూ లేస్తూ షూటింగ్ జరుపుకుంటోంది. ఇది పూర్తయ్యి వచ్చే ఏడాది విడుదల కావాల్సి ఉంది. దీని తర్వాత రాజమౌళి దర్శకత్వంలో పాన్ వరల్డ్ సినిమా చేయబోతున్నాడు. సమయం ఎక్కువగా ఉండటంతో రాజమౌళి చిత్రంకన్నా ముందుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేయాలని ప్రిన్స్ భావిస్తున్నారు.
ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన చిత్రం అనిమల్. రణబీర్ కపూర్ హీరోగా నటించారు. ఈ సినిమా డిసెంబరు 1న విడుదల కాబోతోంది. టీజరు చూసినవారు సినిమా అద్భుతంగా ఉండని ప్రశంసలు కురిపిస్తున్నారు. మొదట ఈ సినిమా కథను మహేష్ బాబుకే వినిపించారు సందీప్. అయితే అటువంటి క్యారెక్టర్ తనకు సూట్ అవదని ప్రిన్స్ సున్నితంగా తిరస్కరించారు. ఈ సినిమా విడుదలైన తర్వాత బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందనే అంచనాలున్నాయి.

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప ఎంత సంచలన విజయం సాధించిందో తెలిసిందే. సుకుమార్ మొదటగా ఈ కథ మహేష్ బాబుకే వినిపించారు. అయితే తనకన్నా అల్లు అర్జున్ కు బాగా నప్పుతుందని భావించిన మహేష్ బాబు దర్శకుడికి బన్నీ పేరును సూచించారు.
ఒక భాగం పూర్తయిన తర్వాత రెండో భాగం షూటింగ్ జరుపుకుంటోంది. వచ్చే ఏడాది ఆగస్టు 15వ తేదీన పుష్ప2 విడుదల కాబోతోంది. అలా ఈ సినిమాను కూడా మహేష్ బాబు వదులుకోవడంతో రెండు బ్లాక్ బస్టర్లు తమ హీరో వదులుకున్నాడని, మహేషే చేసుంటే ఈ రెండు సినిమాల లెక్క ఇంకో రకంగా ఉండేదంటూ నిట్టూరుస్తున్నారు.












Click it and Unblock the Notifications