మహేష్‌బాబు వదులుకున్న ఇండస్ట్రీ హిట్స్

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో పాన్ వరల్డ్ మూవీలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. హీరోయిన్ గా ప్రియాంక చోప్రా నటిస్తోందంటూ వార్తలు వస్తున్నాయికానీ దీన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించలేదు. వచ్చే ఏడాది చివరలో ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది. ఒక భాగమా, రెండు భాగాలా? అనేది ఇంకా తెలియలేదు. కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ బీజీఎం అందించే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లో దీన్ని విడుదల చేయబోతున్నారు. ఈ సినిమా బడ్జెట్ రూ.1500 కోట్లు. మహేష్ బాబు తన కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను వదులుకున్నాడు. అవి చేసుంటే ఎంత బాగుండేదో అంటూ అభిమానులు చర్చించుకుంటుంటారు. ప్రిన్స్ వదులుకున్న బ్లాక్ బస్టర్లు, ఇండస్ట్రీ హిట్ల గురించి తెలుసుకుందాం.

తన వ్యక్తిత్వానికి భిన్నంగా ఉందన్న మహేష్
సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా రెండు భాగాలుగా వచ్చి సన్సేషనల్ హిట్ అయింది. దర్శకుడు ఈ కథను ముందుగా మహేష్ బాబుకే చెప్పినప్పటికీ అది తనకు సెట్ అవదని, క్యారక్టరైజేషన్ ను అభిమానులు అంగీకరించరంటూ దాన్నుంచి తప్పుకొని అల్లు అర్జున్ పేరును సిఫార్సు చేశారు. యానిమల్ సినిమా అతి పెద్ద సంచలన విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ముందుగా మహేష్ బాబుతోనే చర్చించినప్పటికీ హీరో పాత్ర తీరు తన వ్యక్తిత్వానికి భిన్నంగా ఉందని సినిమా చేయననడంతో చివరకు వంగా రణబీర్ తో తెరకెక్కించాడు.

superstar mahesh babu missed block buster movies list

ఫిదా, గజినీ, ఇడియట్...
ఫిదా సినిమా తీసిన శేఖర్ కమ్ముల కూడా మహేష్ బాబును దృష్టిలో ఉంచుకొనే కథ రాసుకున్నాడు. అయితే అందుకు కూడా నో చెప్పడంతో కొన్ని కారణాలవల్ల వరుణ్ తేజ్ తో తీశాడు. ఈ సినిమాలకు ముందు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇడియట్ అప్పటి యువతరాన్ని ఊపేసింది. ప్రిన్స్ తో చేద్దామని పూరీ ప్రయత్నించినా తను ఒప్పుకోకపోవడంతో చివరకు రవితేజతో తీశాడు. సూర్యతో మురుగదాస్ తీసిన గజినీ సినిమా కూడా మహేష్ బాబు చేయాల్సి ఉంది. కానీ అతను నో చెప్పడంతో సూర్యతో తెరకెక్కించి ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. గజినీ కథను 12 మంది హీరోలు తిరస్కరించడం గమనార్హం. అలాగే ఏమాయ చేశావే, వర్షం సినిమాలు కూడా మహేష్ బాబు చేయాల్సివుందికానీ చేయలేదు. ఇవన్నీ చేసివుంటే ఎలా ఉండేదోకదా అనుకుంటున్నారు మహేష్ బాబు అభిమానులు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+