సూర్య – జ్యోతిక విడాకులు..? ఊహించని ట్విస్ట్ ఇచ్చిన జ్యోతిక

ఇటీవల కాలంలో చాలామంది సెలబ్రిటీలు తమ వైవాహిక జీవితానికి గుడ్ బై చెబుతున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తితో జీవితాన్ని కొనసాగించలేక తమ బంధానికి బ్రేకప్ చెప్పేస్తున్నారు. తమ లైఫ్ పార్టనర్‌తో రాజీ పడకపోవడం అత్తింటి గొడవలు , పెళ్లి తరువాత కూడా కెరీర్ కొనసాగించడం, పర్సనల్ లైఫ్‌ను మెయిన్‌టైయిన్ చేయడం మొదలగు కారణాలతో సెలబ్రిటీలు విడాకులు బాట పడుతున్నారు.

చిరంజీవి కూతురు శ్రీజ, నాగబాబు కూతురు నిహారిక, నాగార్జున కొడుకు నాగచైతన్య, మోహన్ బాబు కొడుకు మనోజ్, రజనీకాంత్ కూతురు ఐశ్వర్య , పవన్ కళ్యాణ్ వంటి వారు విడాకులు తీసుకున్న వారి జాబితాలో ఉన్నారు. ఇక ఇటీవలే అభిషేక్ బచ్చన్ - ఐశ్వర్య రాయ్‌లు సైతం విడాకులు తీసుకోవడానికి సిద్దపడ్డారనే వార్తలు వచ్చాయి. తాజాగా ఈ జాబితాలో మరో జంట వచ్చి చేరింది.

Suriya and Jyothika separating ?

తమిళ స్టార్ హీరో సూర్య అతని భార్య జ్యోతికలు విడాకులు తీసుకోబోతున్నారనే వార్త కోలీవుడ్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. గత కొంతకాలంగా సూర్య- జ్యోతికల మధ్య గొడవలు జరుగుతున్నాయని..వీరి మధ్య అభిప్రాయభేదాలు తలెత్తడంతో..జ్యోతిక ఏకంగా ముంబైకి తన మకాన్ని మార్చిందనే కథనాలు చాలానే ప్రసారం అవుతున్నాయి. అయితే తాజాగా దీనిపై జ్యోతిక క్లారిటీ ఇచ్చారు.

నాకు సూర్యకి మధ్య ఎటువంటి గొడవలు లేవని..సూర్య చాలా డీసెంట్ పర్సన్ అంటూ అతని గురించి చాలా గొప్పగా చెప్పుకొచ్చింది.మా అమ్మ నాన్నలు ముంబైలో ఉంటారని..వారి కోసమే తాను ఇక్కడికి వచ్చానని జ్యోతిక తెలిపారు. వయస్సు రీత్య వారికి తన తోడు అవసరం ఉందని అందుకోసమే తాను ముంబైకి వచ్చానని..త్వరలోనే తిరిగి చైన్నై వెళ్లిపోతానని ఆమె తెలిపింది.

సూర్య ప్రస్తుతం కంగువా సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.ఈ సినిమా ఆయన కెరీర్‌లో క్రేజీ ప్రొజెక్ట్‌గా తెరకెక్కుతుంది. ఈ సమయంలో నా ఫ్యామిలీ కోసం సూర్యను ఇబ్బంది పెట్టడం సరైంది కాదనే, తాను ఒక్కదాన్నే ముంబైకి వచ్చినట్టు జ్యోతిక చెప్పుకొచ్చింది. దీంతో సూర్య-జ్యోతికల విడాకులపై వస్తున్న పుకార్లకు ఫుల్‌స్టాప్ పెట్టినట్టైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+