హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..!
Suyoadhana Movie Review: తెలుగు తెరపై కమెడియన్‌గా అడుగుపెట్టి, 'బలగం' వంటి చిత్రంతో తనలోని నటుడి విశ్వరూపాన్ని చూపించిన ప్రియదర్శి, ఇప్పుడు మరో ప్రయోగాత్మక చిత్రంతో మనముందుకు వచ్చారు. సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిన 'సుయోధన' ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో చూద్దాం.
కథ:
వరుణ్ (ప్రియదర్శి) ఒక 'ఫోలే' ఆర్టిస్ట్. అంటే తెరపై కనిపించే చిన్న చిన్న శబ్దాలకు (నడక, గ్లాసు పెట్టడం వంటివి) ప్రాణం పోసే వ్యక్తి. అయితే, వరుణ్‌కు చిన్నప్పటి నుండి ఓ వింత సమస్య ఉంటుంది. అతనికి ఎప్పుడూ 'సుయోధన' అనే శబ్దం వినిపిస్తూ, కళ్ళముందు దుర్యోధనుడి ఆకారం కదలాడుతూ భయపెడుతుంటుంది. అతని తండ్రి మద్దులూరి ప్రకాష్ (సాయి కుమార్) గొప్ప నాటక కళాకారుడు, ఆయనకు దుర్యోధనుడి పాత్రంటే ప్రాణం. కథలో మలుపు ఎక్కడంటే.. హీరోయిన్ సమిత (ద్రిషిక చందర్) తీసిన ఒక డెమో ఫిలిం చూస్తున్నప్పుడు వరుణ్‌కు మళ్ళీ ఆ భయంకర రూపం కనిపిస్తుంది. అసలు ఈ శబ్దం వెనుక ఉన్న మిస్టరీ ఏంటి? రాజకీయాల్లోకి వెళ్లిన తన తండ్రికి, వరుణ్ భయానికి ఉన్న సంబంధం ఏంటి? చివరకు ఆ 'సుయోధన' ఎవరు? అనేదే ఈ చిత్ర క్లైమాక్స్.

విశ్లేషణ:
సాధారణంగా సైకలాజికల్ థ్రిల్లర్లు టాలీవుడ్‌లో కొత్తేమీ కాదు, కానీ 'ఫోలే ఆర్టిస్ట్' అనే వృత్తిని కథా వస్తువుగా తీసుకోవడం దర్శకుడు వైఎస్ మాధవ్ రెడ్డి చేసిన గొప్ప ప్రయోగం. సినిమా ఆరంభం నుంచే ప్రేక్షకుడిని కథలోకి లాగేయడంలో దర్శకుడు విజయం సాధించారు. తర్వాతి సీన్‌లో ఏం జరుగుతుంది? అనే ఉత్కంఠను చివరి వరకు కాపాడారు. ఈ సినిమాకు అసలైన హీరో సౌండ్ ఎఫెక్ట్స్. జై క్రిష్ అందించిన నేపథ్య సంగీతం థియేటర్లో కూర్చున్న ఆడియెన్స్‌ను భయపెడుతూనే, కథలో లీనం చేస్తుంది.కేవలం థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ మాత్రమే కాకుండా.. తల్లి సెంటిమెంట్, తండ్రి కొడుకుల మధ్య ఉండే సంఘర్షణను కూడా దర్శకుడు చక్కగా బ్యాలెన్స్ చేశారు. అయితే, అక్కడక్కడా కొన్ని సన్నివేశాలు కాస్త నెమ్మదించినట్లు అనిపించినా, సెకండ్ హాఫ్‌లోని ట్విస్టులు ఆ లోటును భర్తీ చేస్తాయి.
నటీనటుల ప్రతిభ:
ప్రియదర్శి తన బాడీ లాంగ్వేజ్, కళ్లల్లో కనిపించే భయంతో వరుణ్ పాత్రకు ప్రాణం పోశాడు. ఇది అతని కెరీర్‌లో మరో మైలురాయిగా నిలిచిపోతుంది.'డైలాగ్ కింగ్' సాయి కుమార్ మరోసారి తన విశ్వరూపాన్ని చూపించారు. దుర్యోధనుడి గంభీరతను, తండ్రిలోని ప్రేమని అద్భుతంగా పండించారు.సీనియర్ నటి ప్రేమ తల్లి పాత్రలో ఒదిగిపోగా, హీరోయిన్ ద్రిషిక తన పరిధి మేర చక్కగా నటించింది. సత్యదేవ్, బిత్తిరి సత్తిల అతిధి పాత్రలు కథకు అదనపు ఆకర్షణగా నిలిచారు.
ప్లస్ పాయింట్స్:
ప్రియదర్శి, సాయి కుమార్‌ల నటన ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ గా నిలించింది. నవ్యతతో కూడిన 'ఫోలే' ఆర్టిస్ట్ నేపథ్యం ఆకట్టుకుంది. వెన్నులో వణుకు పుట్టించే సౌండ్ ఎఫెక్ట్స్, మ్యూజిక్ ప్రేక్షకులను అలరించాయి. సెకండ్ హాఫ్‌లో వచ్చే ఊహించని ట్విస్టులు ఆడియెన్స్ ను ఆకట్టుకున్నాయి.
మైనస్ పాయింట్స్:
ఫస్ట్ హాఫ్‌లో అక్కడక్కడా కథనం నెమ్మదించినట్లు అనిపించింది.ఇన్వెస్టిగేషన్ సీన్స్ ఇంకాస్త బలంగా ఉంటే బాగుండేది.
ఫైనల్‌గా:
'సుయోధన' కేవలం ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మాత్రమే కాదు.. అద్భుతమైన శబ్ద తరంగాల ప్రయాణం. రొటీన్ మాస్ మసాలా సినిమాలకు దూరంగా, కొత్తదనాన్ని కోరుకునే ప్రేక్షకులకు ఇది ఒక 'మస్ట్ వాచ్' మూవీ. ఈ వీకెండ్‌లో ఒక మంచి మిస్టరీని ఎంజాయ్ చేయాలనుకుంటే 'సుయోధన' బెస్ట్ ఛాయిస్.
రేటింగ్: 3/5
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications