Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నాని అభిమానులకు స్వీట్ ట్విస్ట్.. హిట్ 3 లో ఏకంగా ఇద్దరు స్టార్ హీరోలు..?

నేచురల్ స్టార్ నాని.. ఫుల్ జోష్ లో దూసుకుపోతున్నారు. ఓ పక్క హీరోగా.. మరో పక్క నిర్మాతగా కూడా డబుల్ బొనాంజా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇప్పటికే హీరోగా దసరా, హాయ్ నాన్న, సరిపోదా శనివారంతో హ్యాట్రిక్ హిట్లు అందుకున్నాడు. అలానే నిర్మాతగా కూడా రీసెంట్ గానే 'కోర్'టు సినిమాని రిలీజ్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ సాధించాడు. ఇప్పటికీ ఈ చిత్రం థియేటర్స్ లో అలరిస్తూనే ఉంది. ఈ క్రమంలోనే ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

ప్రస్తుతం శైలేష్ కొలను దర్శకత్వంలో హిట్ 3 థర్డ్ కేస్ మూవీలో నటిస్తూ, నిర్మిస్తున్నాడు నాని. ఈ చిత్రంలో హీరోయిన్ గా కేజీఎఫ్ హీరోయిన్ శ్రీనిధి శెట్టి నానికి జోడీగా నటించింది. మిక్కీ జే మేయ‌ర్ సంగీతాన్ని అందిస్తున్నారు. రీసెంట్ గానే ఒక మెలోడీ సాంగ్ రిలీజ్ అవ్వగా మంచి రెస్పాన్స్ లభిస్తోంది. ఇన్నాళ్లు లవ్ స్టోరీస్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సినిమాలు చేసిన నాని దసరాతో రూట్ మార్చగా.. సరిపోదా శనివారం చిత్రంతో అదరగొట్టాడు. ఇక హిట్ 3 తో ఫుల్ మీల్స్ అందించాలని చూస్తున్నాడు. మే 1 న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కాబోతున్న ఈ చిత్రం పై భారీ ఆశలే పెట్టుకున్నాడు నాని.

sweet-twist-for-nani-fans-two-more-star-heros-in-hit-3

హిట్ 3 మరో స్టార్ హీరో..?

అయితే ఈ సినిమాకి సంబంధించి ఓ వార్త సినీ వర్గాల్లో ఫుల్ గా చక్కర్లు కొడుతోంది. హిట్ ఫ్రాంచైజీలో వరుసగా సినిమాలు వస్తుండగా ఫస్ట్ కేసులో విశ్వక్ సేన్, సెకండ్ కేసులో అడవి శేష్ నటించారు. ఇప్పుడు హిట్ 3 లో నానితో పాటు.. అడవి శేష్ కూడా కనిపిస్తారని రీసెంట్ గానే లీక్ ఇచ్చారు.

అయితే నాని ఎలా అయితే హిట్ 2 క్లైమాక్స్ లో కనిపించారో అలానే హిట్ 3 చివర్లో.. 'హిట్ 4'లో హీరో కూడా కనిపిస్తారని టాక్ నడుస్తోంది. ఇలా హిట్ 4 లో హీరోని రివీల్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. హిట్ 4 మూవీలో మాస్ మహరాజ్ రవితేజ కానీ.. నందమూరి నటసింహం బాలకృష్ణ కానీ నటిస్తారని గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో హిట్ 3 లో నానితో పాటు ఇద్దరు హీరోల ఎంట్రీ పక్కా అని చెబుతున్నారు.

ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. టీజర్ గమనిస్తే.. శ్రీనగర్‌ నేపథ్యంలో జరిగే ఈ కథలో ఒకేలా వరుస హత్యలు జరుగుతుండడం ఆ కేసును అర్జున్‌ సర్కార్‌కు అప్పగించడం చూడవచ్చు. కొత్తగా ఈసారి నానితో బీప్ డైలాగ్స్ కూడా చెప్పించడం గమనార్హం. ఇక టీజర్ లాస్ట్ లో నాని సూట్ తో ఎంట్రీ ఇవ్వడం.. ఒకర్ని రెండు ముక్కలుగా నరికేయడం అయితే పీక్స్ అంటున్నారు ఫ్యాన్స్.

అప్పుడు దసరా.. ఇప్పుడు ప్యారడైజ్..

ఈ సినిమా తర్వాత శ్రీకాంత్ డైరెక్షన్ లో 'ది ప్యారడైజ్', సుజీత్ డైరెక్షన్ లో కూడా ఒక మూవీ చేస్తున్నారు. నాని పుట్టిన రోజు సందర్భంగా 'ది ప్యారడైజ్'మూవీ నుంచి రిలీజ్ చేసిన గ్లింప్స్ సైతం సెన్సేషన్ గా మారాయి. నాని గత చిత్రాలకు పూర్తి భిన్నంగా రా అండ్ రస్టిక్ మోడ్ లో నాని కనిపించారు. ముఖ్యంగా సినిమా విజువల్స్ వేరే ప్రపంచానికి మనల్ని తీసుకువెళితే.. అసభ్య పదజాలం మాత్రం ఊహించని షాక్ ఇచ్చింది. నాని సినిమాలో ఈ తరహా డైలాగ్ ఏంటి అని ఒకింత షాక్ అయ్యారు.

ప్యారడైజ్ సినిమాలో నాని తల్లి పాత్రలో సోనాలి కులకర్ణి నటిస్తున్నట్లు మొదట వార్తలు వచ్చాయి. ఆ తర్వాత నటి రమ్యకృష్ణ తల్లి క్యారెక్టర్ లో నటిస్తున్నారని గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. అంతే కాకుండా ఈ మూవీలో కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు విలన్ రోల్ చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. కథ నచ్చడంతో మోహన్ బాబు కూడా ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు. కెరీర్ ప్రారంభంలో విలన్ గా గుర్తుండి పోయే పాత్రల్లో నటించిన మోహన్ బాబు.. మళ్లీ విలన్ గా చేస్తే గూస్ బంప్స్ కన్ఫార్మ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఈ చిత్రాన్ని సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నాడు. దసరా లాంటి భారీ హిట్ తరువాత నాని - శ్రీకాంత్ ఓదెల కాంబోలో వస్తున్న చిత్రం కావడంతో మొదటి నుంచి అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. గ్లింప్స్ లో సైతం నాని గత చిత్రాలకు పూర్తి భిన్నంగా రా అండ్ రస్టిక్ మోడ్ లో నాని కనిపించబోతున్నట్టు చూపించడం మరింత ఆసక్తి రేకెత్తిస్తోంది.

శేఖర్ కమ్ములతో మూవీ..!

మరోవైపు నాని శేఖర్ కమ్ములతో ఓ మూవీ కోసం చేతులు కలపబోతున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఫీల్ గుడ్ సినిమాలతో డైరెక్టర్ గా తనకంటూ ఓ మార్క్ క్రియేట్ చేసుకున్నారు శేఖర్ కమ్ముల. ప్రస్తుతం కింగ్ అక్కినేని నాగార్జున, ధనుష్‌ లతో 'కుబేర' మూవీ తెరకెక్కిస్తున్నారు. ఈ క్రమంలోనే వీరి కాంబినేషన్ లో సినిమా ఫిక్స్ అయినట్టు చెబుతున్నారు. దీంతో శేఖర్ కమ్ముల మార్క్ డైరెక్షన్, నాని నేచురల్ యాక్టింగ్ కలిస్తే ఎలా ఉంటుందో అని క్యూరియాసిటీ పెరిగిపోయింది. నాని, శేఖర్ కమ్ముల ప్రస్తుతం ఉన్న కమిట్ మెంట్ లను ఫినిష్ చేశాక మూవీ తెరకెక్కించే ఛాన్స్ ఉందంటున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+