త్వరలో విలన్‌తో పెళ్లి పీటలెక్కబోతున్న తమన్నా..
మిల్కీ బ్యూటీ తమన్నా బాటియాకు పెళ్లి గడియలు దగ్గరపడుతున్నాయి. ఇప్పడు ఇదే వార్త ఇండస్ట్రీలో ట్రెండీగా మారిపోయింది. విలక్షన నటుడు విజయ్ వర్మతో ఇప్పటికే ప్రేమలో ఉన్నట్లు బయటపెట్టిన విషయం తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సైతం పెళ్లి గురించి తమ అభిప్రాయాలను చెబుతూనే ఇప్పట్లో ఆ ఆలోచన లేదని తమన్నా వెల్లడించింది. అయితే, తాజాగా వీరి పెళ్లిప్రస్తావన ప్రచారంలోకి రావడంతో అటు కుటుంబసభ్యులు, ఇటు అభిమానులు తీవ్ర ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.
విలన్ పాత్రలో విజయ్‌వర్మ : టాలీవుడ్‌లో బహుబలి వంటి చిత్రాల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది ఈ మిల్కీ బ్యూటీ. ఇక విజయ్ గురించి చెప్పక్కర్లేదు. బాలీవుడ్‌లో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. విజయ్ వర్మ తెలుగులో కూడా పలు సినిమాల్లో నటించారు. నాచురల్ స్టార్ నానీ నటించిన ఎమ్‌సిఎ చిత్రంలో విలన్ పాత్రలో విజయ్ వర్మ అదరగొట్టాడు. ఇక, వీరిద్దరి ప్రేమాయణం గురించి ఎప్పుడో బయటపడింది. అయితే, పెళ్లి విషయంపై కాస్తా వెనక్కితగ్గిన ఈ జంట తాజాగా మరోసారి తమ పెళ్లివార్తలతో హాట్‌టాపిక్‌గా నిలిచారు.

వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పెళ్లి : తమన్నా, విజయ్ వర్మ ఇద్దరూ కలిసి లస్ట్ స్టోరీస్ 2 సినిమాలో నటించారు. అందులో వీరిద్దరి రొమాన్స్ మరింతగా వైరల్ అయ్యింది. ఈ సినిమా తర్వాతే వీరిపై రూమర్స్ ఎక్కువయ్యాయి. అయితే, ఈ రూమర్స్ పై వీరిద్దరూ స్పందించి, అవును మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం, డేటింగ్ చేస్తున్నాం అంటూ క్లారిటీ ఇచ్చి వారి ప్రేమ వ్యవహారాన్ని బయటపెట్టేశారు. వీరి పెళ్లి గురించి చాలామంది అడగ్గా ఇప్పట్లో చేసుకోము అనే వార్తలు వచ్చాయి. అయితే గత రెండు రోజులుగా వీరు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని న్యూస్ మాత్రం తెగవైరల్ అవుతోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ లవ్‌బర్డ్స్ పెళ్లిపీటలు ఎక్కబోతున్నారనే వార్త బీ టౌన్ వర్గాల్లో తెగ వినిపిస్తోంది.
కుటుంబసభ్యుల ఒత్తిడితో : తమన్నావయసు ఇప్పుడు 33, విజయ్ వర్మకు 37 ఏళ్ళు. ఇటీవల తమన్నాకుటుంబసభ్యులు పెళ్లి చేసుకోమని ఒత్తిడి తేవడంతో వీరిద్దరూ పెళ్లికి సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. డిసెంబర్ చివరి వారం లేదా జనవరిలో వీరి నిశ్చితార్థం ఉంటుందని, ఆ తర్వాత ఫిబ్రవరిలో పెళ్లి జరుగుతుందని సమాచారం. అయితే ఈ పెళ్లి విషయంపై తమన్నాకానీ, విజయ్ వర్మ కానీ, అధికారికంగా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఈ వార్తలపై కూడా స్పందించలేదు.












Click it and Unblock the Notifications