తమన్నా, కాజల్.. ఇలా బుక్ అయ్యారేంటి..?
స్టార్ హీరోయిన్స్ తమన్నా, కాజల్ అగర్వాల్ చిక్కుల్లో పడ్డారు.క్రిప్టో కరెన్సీ మోసానికి సంబంధించి కేసులో తమన్నా, కాజల్ అగర్వాల్ పేర్లు తెర మీదకు వచ్చాయి.క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని జనాలను మోసం చేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు అందింది. చెన్నై, పుదుచ్చేరికి చెందిన పదిమంది నుంచి సుమారుగా రూ. 2.40 కోట్లు వసూలు చేసి మోసానికి పాల్పడినట్లు అశోకన్ అనే రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి ఫిర్యాదు చేశారు.
దీనిపై పోలీసులు విచారణ చేపట్టారు.నిందితుల విచారణ నేపధ్యంలో దాదాపు రూ. 60 కోట్ల మేర స్కామ్ జరిగినట్టు గుర్తించారు. ఈ నేపథ్యంలో నీతీష్ జైన్,అరవింద్ కూమార్ అరెస్టు చేశారు. విచారణలో సమయంలో కీలకమైన విషయాలు రాబట్టారు. పుదుచ్చేరి లో మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్, చెన్నై,కోయంబత్తూరు లోను క్రిప్టోకరెన్సీ పేరుతో మోసాలు చేసినట్లు నిందితులు వెల్లడించారు. అయితే ఈ క్రిప్టోకరెన్సీకి సంబందించి 2022లో కోయంబత్తూరు జరిగిన లాంచింగ్ ఈవెంట్‌లో హీరోయిన్స్ తమన్నా,కాజల్ అగర్వాల్ పాల్గొన్నారు.

వారు ప్రమోట్ చేయడం వల్ల వారు కూడా ఈ స్కామ్ లో భాగస్వాములుగా ఉండవచ్చనే అనుమానాలపై దర్యాప్తు చేస్తున్నారు.ఈవెంట్లో పాల్గొన్నందుకు డబ్బులు ఎలా ఇచ్చారు, ముంబైలో జరిగిన ఈవెంట్ లో ఇన్వెస్టర్లను తీసుకురావడానికి తమన్నా, కాజల్ ఎందుకు ప్రయత్నించారు అనే వివరాలను పుదుచ్చేరి పోలీసులు సేకరించనున్నారు .ఇప్పుడు కేసు దర్యాప్తులో భాగంగా కాజల్ అగర్వాల్, తమన్నాలను విచారించాలని పోలీసులు నిర్ణయించారు.
2022లో క్రిప్టో కరెన్సీ కంపెనీ కోయంబత్తూరు ప్రధాన కార్యాలయంగా ప్రారంభం అయింది. మహాబలిపురంలోని ఒక స్టార్ హోటల్లో జరిగిన ఈ కంపెనీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో హీరోయిన్స్ కాజల్ అగర్వాల్, తమన్నా పాల్గొన్నారు.ఇప్పుడే వారి మెడకు చుట్టుకుంది.మరి దీనిపై ఈ స్టార్ హీరోయిన్ ఏవిధంగా స్పందిస్తారో చూడాలి.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ?












Click it and Unblock the Notifications