పెళ్లి కాకుండానే పేరెంట్స్ అయిన తమన్నా - విజయ్ వర్మ..!
మిల్కీ బ్యూటీ తమన్నా తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. దాదాపు స్టార్ హీరోలు అందరితో నటించిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం తెలుగులో సినిమాలు తగ్గించింది. కానీ బాలీవుడ్ లో మాత్రం ఫుల్ ఫామ్ లో దూసుకుపోతున్న ఈమె.. బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో డేటింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. త్వరలోనే వీరిద్దరూ పేలలిపీటలు ఎక్కబోతున్నారని టాక్ నడుస్తోంది. అయితే ఇంకా పెళ్లి కాకుండానే వీరిద్దరూ తల్లిదండ్రులు కావడం ఫిల్మ్ ఇండస్ట్రీని షేక్ చేస్తోంది.
అయితే వారు నిజంగా తల్లిదండ్రులు కావడం లేదని ఓ బాలీవుడ్ బ్యూటీ వారిని తల్లిదండ్రులుగా ఫీల్ అవుతుందని తెలియడంతో తమన్నా ఫ్యాన్స్ కాస్త రిలాక్స్ అవుతున్నారు. ఆమె ఎవరు ? అసలు తమన్నా - విజయ్ వర్మ ఎలా తల్లిదండ్రులు అయ్యారో తెలుసుకుందాం..

ప్రముఖ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా తడానీ 'ఆజాద్' సినిమాతో బాలీవుడ్ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అజయ్ దేవగన్ మేనల్లుడు ఆమన్ దేవగన్ ఆ మూవీలో హీరోగా నటించాడు. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రాషా.. తమన్నా - విజయ్ వర్మ తనకు దేవుడు ఇచ్చిన తల్లిదండ్రులు అంటూ తెలిపింది. ఒక తన 20వ పుట్టిన రోజు వేడుకల్లో తమన్నాతో పరిచయం ఏర్పడగా.. ఇప్పుడు అత్యంత సన్నిహితులయ్యామని వెల్లడించింది.
ఒక పార్టీలో గాయకుడు పాడుతుంటే తాను డాన్స్ చేస్తుండగా.. ఆ సమయంలో అక్కడికి వచ్చిన తమన్నా తనతో పాటు ఆ పాటకు డాన్స్ వేసిందని చెప్పింది. అఆ తర్వాత తమ మధ్య మధ్య బంధం మరింత బలపడిందని స్పష్టం చేసింది. తమన్నాతో తనకు ఎంతో అనుబంధం ఏర్పడిందని వివరించింది. ఇప్పుడు తమన్నా లేకుండా తాను ఏం చేయాలో కూడా తనకు తెలియదని వ్యాఖ్యానించింది. అయితే తమన్నాను ఆంటీ అని పిలిచింది రాషా తడాని. అప్పుడు ఆ వీడియో ఫుల్ వైరల్ అయిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ భామ చేసిన కామెంట్స్ ఫుల్ వైరల్ గా మారాయి.












Click it and Unblock the Notifications