తమన్నా ఖాతాలో ఆ క్రికెటర్‌తో సహా ఎంతమంది బలయ్యారో తెలుసా..?

హీరోయిన్ తమన్నా గాఢమైన ప్రేమలో ఉన్న విషయం అందరికి తెలిసిందే. తమన్నా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉంది.వీరు కలిసి 'లస్ట్ స్టోరీస్ 2'సినిమాలో నటించారు. ఆ సమయంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది.2022 నుంచి వారిద్దరూ డేటింగ్‌లో ఉన్నారు. మీరిద్దరి వ్యవహారం గురించి బాలీవుడ్ మీడియాలో చాలా కథనాలు వెలువడ్డాయి. రిలేషన్‌పై వీరిని ప్రశ్నించగా. అలాంటిది ఏమీ లేదని..మేమిద్దరం కేవలం స్నేహితులమే అంటూ మొదట్లో కలరింగ్ ఇచ్చారు. విజయ్ వర్మ కుటుంబంలో జరిగిన ఓ ఫంక్షన్‌లో తమన్నా తళుక్కున మెరిసింది. ఆ తర్వాత ఇద్దరు కలిసి విదేశాలకు వెళ్లారు.

దీంతో విజయ్ వర్మతో తమన్నా ప్రేమలో ఉందని అందరికి అర్థం అయింది. ఇదే సమయంలో తమ బంధంపై ఈ జంట గతేడాది చివర్లో ఓ క్లారిటీ ఇచ్చారు. తమ మధ్య ఉన్న ప్రేమను బయటపెట్టారు. మేమిద్దరం ప్రేమించుకుంటున్నామని..త్వరలోనే పెళ్లికి చేసుకోబోతున్నామంటూ ఈ జంట ప్రకటించింది.పలు ఈవెంట్స్‌లో తమన్నాతో కలిసి విజయ్ వర్మ సందడి చేశారు. పలు ఫంక్షన్స్‌లో తమన్నా హ్యాండ్ బ్యాగులు కూడా మోస్తూ విజయ్ వర్మ కనిపించారు. ఇక పెళ్లే అనుకున్న తరుణంలో ప్రియుడు వర్మకు షాకిచ్చింది తమన్నా.

Tamannaah breakup stories list goes viral

ప్రియుడు వర్మకు సంబంధించిన ఫొటోలు,వీడియోలను మిల్కీ బ్యూటీ డిలీట్ చేసింది. అయితే వీరిద్దరు విడిపోయి చాలాకాలం అయిందని బాలీవుడ్ మీడియా కథనాలు ప్రసారం చేస్తున్నాయి. తమన్నా, విజయ్ వర్మల మధ్య అభిప్రాయభేదాలు రావడంతోనే వీరు విడిపోయినట్టు తెలుస్తోంది. దీంతో తమన్నా ఖాతాలో మరో బ్రేకప్ స్టోరీ చేరినట్టు అయింది. గతంలో పలువురితో తమన్నా డేటింగ్ చేసింది. టీనేజ్ సమయంలో ఓ లవ్ ఎఫైర్ నడిపిన తమన్నా, ఆ తర్వాత మరొకరితో రిలేషన్ మెయిన్‌టైన్ చేసింది.

ఇదే సమయంలో తమన్నా ఓ పాకిస్థాన్‌ క్రికెటర్‌ను ప్రేమించిందని, అతనితోనే ఆమెకు బ్రేకప్ అయిందనే ప్రచారం జరిగింది. పాకిస్థాన్ క్రికెటర్ అబ్దుల్ రజాక్‌తో తమన్నా డేటింగ్ చేసిందని రూమర్స్ తెర మీదకు వచ్చాయి. వీరిద్దరూ క్లోజ్‌గా ఉన్న ఫొటోలు సైతం అప్పట్లో బాగానే వైరల్ అయ్యాయి. దీంతో అబ్దుల్ రజాక్‌తో తమన్నా రిలేషన్‌లో ఉందనే ప్రచారం జరిగింది.తర్వాత ఈ రిలేషన్‌కు బ్రేక్ పడింది. ఇప్పుడు విజయ్ వర్మతో కూడా తన రిలేషన్‌‌ను తమన్నా బ్రేక్ చేసుకుంది.అనుష్క శర్మతో వివాహానికి ముందు కోహ్లీ తమన్నాతో డేటింగ్ చేశాడనే ప్రచారం జరిగింది. వీరిద్దరు కలిసి కొన్ని యాడ్స్ చేశారు.

దీంతో వీరి మధ్య ఏదో నడుస్తోందని అప్పట్లో బాలీవుడ్ మీడియా కోడై కూసింది.తాజాగా విజయ్ వర్మతో బ్రేకప్ చెప్పి ఈ భామ వార్తల్లో నిలిచింది. రిలేషన్‌షిప్‌పై తమన్నా ఓపెన్ కామెంట్స్ చేసింది.ప్రతి చిన్న విషయంలో అబద్ధం చెప్పే వాళ్లంటే నాకు నచ్చదని తమన్నా తెలిపింది. అతను అలాంటి వాడని తెలియడంతో కొంత కాలానికి అతనికి బ్రేకప్ చెప్పానని చెప్పుకొచ్చింది. ప్రజెంట్ తమన్నా కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే తమన్నా కామెంట్స్ చేసింది విజయ్ వర్మ గురించేనా అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+