పాకిస్థాన్ క్రికెటర్‌ ప్రేమలో తమన్నా..?

హీరోయిన్ తమన్నా పేరు చెప్పగానే మొదటగా గుర్తుకు వచ్చేది ఆమె అందం. తమన్నా అందం రోజు రోజుకు పెరుగుతుందా అంటే అవుననే సమాధానం వస్తోంది. ఇండస్ట్రీకి వచ్చి 19 ఏళ్లు కావస్తోన్న తమన్నాలో ఎటువంటి మార్పు లేదు. తమిళ, తెలుగు, హిందీ భాషల్లో నటించిన తమన్నా ఫుల్ పాపులారిటీని సంపాదించుకుంది. ఆమె తెలుగు సినిమాల్లో కనిపించి చాలాకాలం అయినప్పటికి తెలుగు స్టార్ హీరోయిన్స్ లిస్ట్‌లో తమన్నా పేరు ఇప్పటికి టాప్‌లోనే ఉంటోంది. తమన్నా క్రేజ్ ఏమాత్రం చెక్కు చెదరలేదు.

ముఖ్యంగా తమన్నా తెలుగు సినిమాల ద్వారానే బాగా ఫేమస్ అయింది. తెలుగు స్టార్ హీరోల అందరితోనూ నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.తన తోటి హీరోయిన్లు కాజల్, నయనతార, రకుల్, సమంత వంటి వారంతా పెళ్లి చేసుకోగా, తమన్నా మాత్రం ఇంకా సినిమాల్లో నటిస్తునే ఉంది. అయితే ఈ ఏడాది తమన్నా పెళ్లి చేసుకునే అవకాశం ఉంది.తమన్నా ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. ఆ మధ్య తమన్నాకు ఆఫర్లు తగ్గినప్పటికి తిరిగి పుంజుకుని వరుస సినిమాల్లో నటిస్తోంది. ముఖ్యంగా బాలీవుడ్ సినిమాలతో పాటు, వెబ్ సిరీస్‌ల్లో నటిస్తూ బిజీ హీరోయిన్‌గా మారిపోయింది.

Tamannaah fallen in love with a Pakistani cricketer

ఇదిలా ఉంటే తాజాగా తమన్నాకు సంబంధించిన ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. గతంలో తనకు లవ్ బ్రేకప్ అయిందని తమన్నానే స్వయంగా చెప్పడం జరిగింది. అయితే ఆ బ్రేకప్ ఎవరితో జరిగిందో అనేది మాత్రం తమన్నా వెల్లడించలేదు. అయితే తమన్నా ఓ పాకిస్థాన్‌ క్రికెటర్‌ను ప్రేమించిందని, అతనితోనే ఆమెకు బ్రేకప్ అయిందనే ప్రచారం జరిగింది. పాకిస్థాన్ క్రికెటర్ అబ్దుల్ రజాక్‌తో తమన్నా డేటింగ్ చేసిందని రూమర్స్ తెర మీదకు వచ్చాయి. వీరిద్దరూ క్లోజ్‌గా ఉన్న ఫొటోలు సైతం అప్పట్లో బాగానే వైరల్ అయ్యాయి.

దీంతో అబ్దుల్ రజాక్‌తో తమన్నా రిలేషన్‌లో ఉందనే ప్రచారం జరిగింది. అయితే తర్వాత దీనిపై తమన్నా వివరణ కూడా ఇవ్వడం జరిగింది. తామిద్దరం ఓ షాపింగ్ మాల్‌ ఓపెనింగ్‌ సమయంలో కలుసుకున్నామని, అబ్దుల్ రజాక్‌‌ను కలవడం అప్పడే మొదటిసారి అని, తమ మధ్య ఎటువంటి బంధం లేదని తమన్నా చెప్పుకొచ్చింది. దీంతో ఈ పుకార్లకు చెక్ పడింది. ఇక తమన్నా వ్యక్తిగత జీవితానికి వస్తే.. హీరోయిన్ తమన్నా ప్రస్తుతం గాఢమైన ప్రేమలో ఉన్న విషయం అందరికి తెలిసిందే. తమన్నా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉంది. వీరిద్దరూ చాలా రోజుల నుంచి డేటింగ్‌లో ఉన్నారు. త్వరలోనే వీరిద్దరు పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+