"ఓదెల 2" ట్విట్టర్ రివ్యూ.. తమన్నా సినిమాపై నెటిజన్లు అదిరిపోయే కామెంట్
ఓదెల 2 చిత్రం 2022లో విడుదలైన 'ఓదెల రైల్వే స్టేషన్' చిత్రానికి సీక్వెల్. దీనికి అశోక్ తేజ దర్శకత్వం వహించారు. సంపత్ నంది ఈ చిత్రానికి కథ అందించడంతో పాటు నిర్మాణ పర్యవేక్షణ కూడా చేశారు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా తమన్నా భాటియా అఘోర పాత్రలో కనిపించడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. టీజర్ మరియు ట్రైలర్\లకు మంచి స్పందన లభించింది. ఈ చిత్రం గురువారం ప్రేక్షకుల ముందుకొచ్చింది.
ఈ సినిమా కథ 'ఆత్మ వర్సెస్ పరమాత్మ' అనే కాన్సెప్ట్‌పై ఆధారపడి ఉంటుంది. మొదటి భాగంలో చనిపోయిన తిరుపతి ఆత్మగా మారి ఊరిని ఇబ్బంది పెడుతుండగా, అతనిని కట్టడి చేయడానికి హెబ్బా పటేల్ సోదరి అయిన శివశక్తి (తమన్నా భాటియా) రంగంలోకి దిగుతుంది. నాగ సాధువుగా కనిపించే తమన్నా, దుష్ట శక్తుల నుండి ఓదెల గ్రామాన్ని ఎలా రక్షిస్తుందనేది కథాంశం.విడుదలైన కొన్ని గంటల్లోనే సోషల్ మీడియాలో ఈ చిత్రంపై ప్రేక్షకుల స్పందనలు వెల్లువెత్తాయి. సినిమా చూసిన నెటిజన్లు తమ అభిప్రాయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తున్నారు.

చాలా మంది నెటిజన్లు తమన్నా భాటియా నటనను ప్రశంసిస్తున్నారు. ఆమె నాగ సాధువు పాత్రలో అద్భుతంగా నటించిందని అంటున్నారు. సినిమాలోని విజువల్ ఎఫెక్ట్స్ (VFX) చాలా బాగున్నాయని కొందరు అభిప్రాయపడుతున్నారు. హెబ్బా పటేల్ మరియు వశిష్ట ఎన్ సింహా తమ పాత్రలకు న్యాయం చేశారని అంటున్నారు. సినిమా కథాంశం 'ఆత్మ వర్సెస్ పరమాత్మ' అనే కాన్సెప్ట్‌పై ఆధారపడి ఉందని తెలుస్తోంది. కొందరు మాత్రం సినిమా హంగామా కనిపించడం లేదని, ప్రేక్షకులు అంతగా పట్టించుకోవడం లేదని అభిప్రాయపడుతున్నారు. ఓవరాల్‌గా, సినిమాకు మిశ్రమ స్పందన లభిస్తోంది. కొందరు బ్లాక్ బస్టర్ అని అంటుంటే, మరికొందరు సాధారణంగా ఉందని అంటున్నారు.












Click it and Unblock the Notifications