ప్రియుడుతో గోవాలో దొరికిపోయిన తమన్నా.. రూమ్‌లో అలాంటి పనితో షాక్?
తెలుగు స్టార్ హీరోయిన్స్ లిస్ట్‌లో తమన్నా పేరు ఇప్పటికి టాప్‌లోనే ఉంటోంది. ఆమె తెలుగు సినిమాల్లో కనిపించి చాలాకాలం అయినప్పటికి , తమన్నా క్రేజ్ ఏమాత్రం చెక్కు చెదరలేదు. ఇండస్ట్రీకి వచ్చి 19 ఏళ్లు కావస్తోన్న తమన్నాలో ఎటువంటి మార్పు లేదు. తమిళ, తెలుగు, హిందీ భాషల్లో నటించిన తమన్నా ఫుల్ పాపులారిటీని సంపాదించుకుంది. ముఖ్యంగా తమన్నా తెలుగు సినిమాల ద్వారానే బాగా ఫేమస్ అయింది. తెలుగు స్టార్ హీరోల అందరితోనూ నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
తమన్నా ప్రస్తుతం సినిమాల కన్నా వెబ్ సరీస్‌ల్లోనే ఎక్కువుగా నటిస్తోంది. తన తోటి హీరోయిన్లు కాజల్, నయనతార, రకుల్, సమంత వంటి వారంతా పెళ్లి చేసుకోగా, తమన్నా మాత్రం ఇంకా సినిమాల్లో నటిస్తునే ఉంది. అయితే ఈ ఏడాది తమన్నా పెళ్లి చేసుకునే అవకాశం ఉంది.తమన్నా హీరోయిన్ తమన్నా ప్రస్తుతం గాఢమైన ప్రేమలో ఉన్న విషయం అందరికి తెలిసిందే. తమన్నా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉంది. వీరిద్దరూ చాలా రోజుల నుంచి డేటింగ్‌లో ఉన్నారు. త్వరలోనే వీరిద్దరు పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతున్నారు.

తాజాగా వీరిద్దరు గోవాకు వెళ్లారు. తమన్నా న్యూ ఇయర్ వేడుకలు అక్కడే ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. అక్కడ తన ఫ్రెండ్స్, ప్రియుడితో కలిసి రూమ్‌లో రచ్చ రచ్చ చేసింది. వారితో గేమ్ ఆడుతూ షాక్ అవుతున్నట్లు, బెడ్ రూమ్‌లో ఫ్రెండ్స్‌తో కలిసి పడుకున్నట్లు, కాఫీ కప్ పట్టుకుని ఫొటోలకు ఫోజులిచ్చింది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ 'గోవా గేట్‌వే' అనే క్యాప్షన్ జత చేసింది. ప్రస్తుతం తమన్నా షేర్ చేసిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.












Click it and Unblock the Notifications