తమిళ నటుడు అజిత్‌కు మరోసారి ప్రమాదం.. గాల్లో పల్టీలు కొట్టిన కారు
తమిళ నటుడు అజిత్‌కు మరోసారి ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. స్పెయిన్‌లో జరుగుతున్న రేసింగ్‌లో ఆయన కారు ప్రమాదానికి గురి కాగా.. ఆయన సురక్షితంగా బయటపడ్డారు. అందుకు సంబంధించిన వీడియోను అజిత్ టీం సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది. దీంతో ప్రస్తుతం ఈ వీడియో ఫుల్ వైరల్ గా మారింది.
ఇటీవల స్పెయిన్‌లోని వాలెన్సియాలో జరిగిన పోర్షే స్ప్రింట్ ఛాలెంజ్ రేస్‌లో పాల్గన్నారు. ఈ రేస్ సమయంలో, ఆయన నడిపిన కారు ముందు వెళుతున్న మరో కారును ఢకొీట్టడంతో గాల్లో రెండుసార్లు పల్టీలు కొట్టింది. అయితే అజిత్ ఈ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడగా.. ఆయనకు తీవ్రమైన గాయాలేమీ కాలేదు. ప్రమాదం జరిగిన వెంటనే ఆయన కారు నుంచి క్షేమంగా దిగినట్లు వీడియోలో కనిపించింది. దీంతో అజిత్ అభిమానులు అంతా ఊపిరి పీల్చుకున్నారు.

ఇక రేసింగ్ అంటే అజిత్‌కు మహా ఇష్టమన్న విషయం తెలిసిందే. అజిత్ కార్ రేసింగ్ అనే ఒక టీమ్‌ను కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ఈ ఏడాది జనవరిలో జరిగిన దుబాయ్ కార్ రేసింగ్ ఈవెంట్‌లో అజిత్ టీం మూడో స్థానం కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ రేస్‌కి ముందు కూడా అజిత్ కారు ప్రమాదానికి గురైంది.












Click it and Unblock the Notifications