ఇదే చివరి సినిమా.. రామ్ చరణ్, ఎన్టీఆర్ ఫేవరెట్ స్టార్ డైరెక్టర్ సంచలన నిర్ణయం !
రియలిస్టిక్ టచ్‌తో సినిమాలు చేసే దర్శకుల్లో కోలీవుడ్ డైరెక్టర్ " వెట్రిమారన్ " ముందుంటారు . 1975లో జన్మించిన ఆయన సినిమాలపై ఆసక్తితో అసిస్టెంట్ డైరెక్టర్‌గా తన కెరీర్ మొదలుపెట్టారు. ప్రముఖ దర్శకుడు బాలా వద్ద శిష్యరికం చేసి.. ఫిల్మ్‌మేకింగ్‌లో ప్రత్యేకమైన స్టైల్‌ను అలవరచుకున్నారు. 2007లో ధనుష్ హీరోగా నటించిన 'పొల్లాధవన్' ద్వారా దర్శకుడిగా అరంగేట్రం చేశారు. మొదటి సినిమాతోనే ఘన విజయం సాధించి.. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు.
ఆ తర్వాత ఆడుకాలం, వడ చెన్నై, విసరనై, అసురన్ చిత్రాలతో భారీ సక్సెస్ లను అందుకోవాడమే కాకుండా నేషనల్ అవార్డులను సైతం సొంతం చేసుకున్నారు. ఇక రీసెంట్ గానే విచారణ పార్ట్ 1, పార్ట్ 2 లతో మరోసారి దర్శకుడిగా తనను తాను ప్రూవ్ చేసుకున్నారు. ప్రస్తుతం హీరో శింబుతో కలిసి ఒక సినిమా చేస్తున్నారు.

తెలుగు స్టార్ హీరోల ప్రశంసలు..
వెట్రిమారన్ సినిమాలకు తెలుగు ఇండస్ట్రీలో కూడా మంచి ఫాలోయింగ్ తెచ్చుకుంది. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి స్టార్ హీరోలు పలుమార్లు వెట్రిమారన్‌ను తమ ఫేవరెట్ తమిళ దర్శకుడిగా పేర్కొన్నారు. వీలైతే ఆయన దర్శకత్వంలో తప్పకుండా సినిమా చేయాలని ఆసక్తి వ్యక్తం చేశారు.
నిర్మాతగా కూడా..
దర్శకుడిగా విజయాలు సాధించిన వెట్రిమారన్.. దర్శకుడుగా కొనసాగుతూనే నిర్మాతగా కూడా మారారు. 2012లో "క్రాస్ రూట్స్ ఫిలిం కంపెనీ" అనే ఒక నిర్మాణ సంస్థను స్థాపించి.. కాకాముట్టై, ఇనారి కోడి, అన్నంకు జై, వడ చెన్నై తో పాటూ మరికొన్ని చిత్రాలను నిర్మించారు.
ప్రస్తుతం ఈ బ్యానర్ ద్వారా 'బ్యాడ్ గర్ల్' సినిమాని కూడా ఆయన నిర్మిస్తున్నారు. ఈ మూవీ సెన్సార్ సమస్యలతో కోర్టు వరకు వెళ్లింది. ఈ క్రమంలోనే వెట్రిమారన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి.

ఈ మేరకు.. ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న వెట్రిమారన్ నిర్మాతగా ఉండడంపై ఊహించని కామెంట్లు చేశారు. సినీ ఇండస్ట్రీలో దర్శకుడిగా కొనసాగడం చాలా సులభమని.. కానీ నిర్మాతగా సక్సెస్ అవడం అంత సులభం కాదన్నారు. దర్శకుడిగా ఉంటే మనం మన పని చేసుకోవడం మాత్రమేనని.. కానీ నిర్మాత అయితే మాత్రం ప్రతి విషయం గురించి తెలుసుకోవాలని అన్నారు. ఆండ్రియా నటించిన 'మానుషి' చిత్రం రివైజింగ్ కమిటీ నుండి కోర్ట్ వరకు వెళ్ళింది.
అదే లాస్ట్ మూవీ..
ఇప్పుడు బ్యాడ్ గర్ల్ కూడా కోర్టుకు వెళుతుండడం తట్టుకోలేకపోతున్నాను. అందుకే నా నిర్మాణ సంస్థను మూసేస్తున్నాను" అంటూ ప్రకటించారు. దీంతో బ్యాడ్ గర్ల్ సినిమా ఆయన నిర్మించే చివరి చిత్రం కానుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.












Click it and Unblock the Notifications