తెలుగు స్టార్ హీరో కూతురితో శింబు పెళ్లి?
సినీ పరిశ్రమలోకి చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చి సూపర్ స్టార్ గా ఎదిగాడు శింబు. శింబు అనే పేరు వింటనే ఠక్కున గుర్తుకు వచ్చే విషయాలు ఏవంటే.. లవ్, బ్రేకప్, అమ్మాయిలు, లిప్ టు లిప్ కిస్. ఈ విషయాలపట్ల బాగా ఆసక్తిగా ఉంటాడంటూ విమర్శలు వచ్చేవి. ఒక దర్శకుడి కొడుకుగా పరిశ్రమలోకి అడుగుపెట్టిన శింబు ఇష్టమొచ్చినట్లుగా వ్యవహరిస్తాడని, క్రమశిక్షణ లేదని, అమ్మాయిల విషయంలో ఆసక్తి బాగా ఎక్కువ అంటూ వార్తలు వచ్చేవి. ముందుగా నయనతారతో రిలేషన్, కిస్, హగ్ ఇచ్చాడు.
నయనతార తర్వాత త్రిష
తర్వాత త్రిషతో ప్రేమాయణం నడిపాడు. ఆ తర్వాత హన్సికతో లవ్ స్టోరీ.. ఇన్ని సంఘటనలు జరిగినా ఒక్కటి కూడా పెళ్లివరకు వెళ్లలేదు. అన్నీ మధ్యలోనే బ్రేకప్ అయిపోయేవి. దీంతో అమ్మాయిలను శింబు వాడుకొని వదిలేస్తాడని, బ్రేకప్ చెబుతాడంటూ గుసగుసలు బాగా వినిపించేవి. ప్రస్తుతం శింబు పేరు ఎందుకు వినపడుతోంది అంటే అతని పెళ్లి ప్రస్తావన వచ్చింది. సోషల్ మీడియాలో తన పెళ్లికి సంబంధించిన వార్త వైరల్ గా మారింది.

భక్తి పారవశ్యంలో ఉన్నాడు
తెలుగు సినీ పరిశ్రమకు చెందిన స్టార్ హీరో కూతురిని శింబు వివాహం చేసుకోబోతున్నాడని, ఇప్పటికే ఇరువైపులా కుటుంబాలు మాట్లాడుకున్నాయని సమాచారం. త్వరలోనే దీనిపై అధికారికంగా ప్రకటన రాబోతోంది. నిశ్చితార్థం, పెళ్లి 15 రోజుల వ్యవధిలోనే ఉండబోతోందని, ఆగస్టులో జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వార్త వైరల్ కావడంతో తమ హీరో ఇప్పటికైనా ఓ ఇంటివాడు కాబోతున్నాడంటూ శింబు అభిమానులు సంబరపడుతున్నారు. కామి గానివాడు మోక్ష గామి కాడని పెద్దలు అంటారు. అందుకు తగ్గట్లుగానే ఒకప్పుడు అమ్మాయిలంటూ వారి చుట్టూ తిరిగిన శింబు ప్రస్తుతం భగవంతుడితో భక్తి పారవశ్యంలో మునిగి తేలుతున్నాడు. శింబు పెళ్లి చేసుకోబోతున్నాడంటూ గతంలో చాలా వార్తలు వచ్చేవి. వచ్చాయి కూడా. అయితే అవన్నీ చివరకు రూమర్లుగానే మిగిలిపోయాయి. మరి ప్రస్తుతం వైరలవుతున్న వార్త నిజమా? కాదా? అనే సందిగ్ధంలో శింబు అభిమానులున్నారు. ఈసారైనా అతని వివాహం జరగాలని అందరూ కోరుకుంటున్నారు.












Click it and Unblock the Notifications