కాళ్లు పట్టుకుంటా.. వాళ్లకి మరణశిక్ష విధించండి - హీరో విశాల్

తమిళ స్టార్ హీరో విశాల్ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అవసరం లేదు. తమిళంలో స్టార్ హీరోగా రాణిస్తున్న విశాల్‌కు తెలుగులో కూడా మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఆయన సినిమాలు ఇక్కడ కూడా విజయాలు సాధిస్తున్నాయి. హిట్లు, ప్లాపులతో సంబంధం లేకుండా విశాల్ వరుసగా సినిమాలు చేస్తూ, ఏడాదికి రెండు మూడు చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. సహజ నటనతో సౌత్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. అలానే సౌత్ ఇండియన్ నటీనటుల సంఘం కార్యదర్శిగా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

కాగా ఇప్పుడు విశాల్ సోషల్ మీడియాలో చేసిన ఒక ట్వీట్ సంచలనం సృష్టించింది. కోయంబత్తూరు విమానాశ్రయం సమీపంలో ఒక యువతిపై జరిగిన సామూహిక అత్యాచారం ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. ఒక కళాశాల విద్యార్థిని తన స్నేహితుడితో కారులో వెళ్తుండగా.. కోయంబత్తూరు ఎయిర్‌పోర్టు దగ్గర వారి కారు ఆగిపోయింది. అదే సమయంలో కారులో వచ్చిన ముగ్గురు వ్యక్తులు ఆ యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేశారు.

tamil-hero-vishal-post-on-coimbatore-rape-case-and-tweet-got-viral

అయితే ఈ వ్యవహారంపై పలువురు పలు రకాలుగా స్పందిస్తున్నారు. అర్ధరాత్రి సమయంలో యువతి బయట తిరగడాన్ని తప్పుబడుతూ ఎమ్మెల్యే ఈశ్వరన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దీనిపై విశాల్ మండిపడ్డారు. ఈ మేరకు ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు. అందులో.. ఆ సమయంలో బాధితురాలు ఆ ప్రదేశంలో ఉన్నందుకు ఆమెను నిందించడం ఆపండి. మన దేశంలో పునరావృతమయ్యే ఈ అత్యాచారం అనే అంశాన్ని రాజకీయం చేయడం ఆపండి అని రాసుకొచ్చారు.

కనీసం ఇప్పుడైనా నేను వేడుకుంటున్నాను, మీ కాళ్ళపై పడి నమస్కరిస్తున్నాను. ఈ దారుణమైన నేరానికి దయచేసి మరణశిక్ష విధించండి. నిర్భయ సంఘటన జరిగింది మనం చూశాం. గత నెలలో, 7 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి, తన సొంత తల్లిని హత్య చేసిన ఆరోపణలపై సుదీర్ఘ విచారణ తర్వాత నిందితుడిని నిర్దోషిగా విడుదల చేయడం మనం చూశాం. సౌదీ అరేబియాలో ఇలా జరుగుతుందా?" అని ప్రశ్నించారు. కొన్ని సంవత్సరాల క్రితం ఆంధ్రప్రదేశ్‌లో ఇటువంటి నేరం జరిగినప్పుడు చర్య తీసుకున్న దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కు నేను సెల్యూట్ చేస్తున్నాను. ఇప్పుడు అలాంటి సమయం వచ్చింది" అని విశాల్ పేర్కొన్నారు.

మరోవైపు ఇటీవలే అవార్డులు గురించి కూడా విశాల్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తనకు ఏ అవార్డు వచ్చినా చెత్తబుట్టలో వేస్తానన్నారు. ఒకవేళ బంగారంతో చేసిన అవార్డులను ఇస్తే వాటిని అమ్మి వచ్చిన ఆ డబ్బులను ఛారిటీకి విరాళంగా ఇస్తానని మాట్లాడడం తీవ్ర చర్చకు దారి తీస్తుంది. 8 కోట్ల మందికి ఏం నచ్చుతుందో 8 మంది నిర్ణయించలేరు కదా అంటూ ఘాటుగా తెలిపారు. అవి ఏ అవార్డులు అయినా కానీ 8 కోట్ల మంది అభిప్రాయాలను 8 మంది ఎలా నిర్ణయిస్తారని చెప్పుకొచ్చారు. తనకు అవార్డులు రావు కాబట్టి అలా అంటున్నారని అనుకోవచ్చని.. కానీ తాను అలా అనడం లేదని స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+