తమిళ హీరో ఆరోగ్య పరిస్థితి విషమం...
డీఎండీకే పార్టీ అధినేత, ఒకప్పటి తమిళ స్టార్ హీరో, విజయకాంత్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని చెన్నైలోని మయత్ ఆస్పత్రి యాజమాన్యం ఓ నివేదికలో వెల్లడించింది. నవంబర్ 18న డీఎండీకే అధినేత విజయకాంత్ అనారోగ్య కారణాలతో చెన్నైలోని మయత్ ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. అయితే, విజయకాంత్ దగ్గు, జలుబు, గొంతునొప్పితో బాధపడుతున్నందున సాధారణ వైద్య పరీక్షల కోసం మాత్రమే ఆసుపత్రికి వెళ్లినట్లు అప్పట్లో డీఎండీకే వెల్లడించింది. అయితే సుమారు తొమ్మిది రోజుల తర్వాత అంటే నేడు, డీఎండీకే అధినేత విజయకాంత్ ఆరోగ్య పరిస్థితికి సంబంధించి మయత్ హాస్పిటల్ యాజమాన్యం ఒక కొత్త వైద్య నివేదికను విడుదల చేయడం జరిగింది.
ఆ నివేదికలో విజయకాంత్ ఆరోగ్యం మెరుగుపడిందని, అయినప్పటికీ, గత 24 గంటలుగా విషమంగా మారినట్లు వెల్లడించింది. వైద్య చికిత్సకు ఆయన శరీరం సహకరిస్తున్నా, పరిస్థితి మాత్రం నిలకడగా లేదని డాక్టర్లు తెలిపారు. అతడు కోలుకోవడానికి పల్మనరీ చికిత్సను వైద్య నిపుణులు సిఫార్సు చేసినట్లు నివేదికలో వెల్లడించారు. అంతేకాదు, ఆయన కోలుకోవడానికి మరో 14 రోజుల పాటు నిరంతర చికిత్స అవసరం అని వెల్లడించారు. వైద్యులు ఇచ్చిన హెల్త్ బులెటన్‌తో డీఎండీకే వర్గాల్లో ఆందోళన మొదలైంది. ఆయన ఆరోగ్యం త్వరగా కుదుట పడాలని పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. గెట్ వెల్ సూన్ అంటూ సోషల్ మీడియా వేదికగా విజయ్‌కాంత్ అభిమానులు పోస్టులు పెడుతున్నారు.

పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా ఉంటోన్న ప్రేమలత...
అనారోగ్య పరిస్థితుల కారణంగా విజయ్‌కాంత్ పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్ గా లేకున్నాఆయన భార్య ప్రేమలత విజయ ప్రభాకరన్ మాత్రం పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. ఆమె ప్రస్తుతం డీఎండీకే కోశాధికారి పదవిలో కొనసాగుతున్నారు. 70 ఏళ్ల వయసున్న విజయ్ కాంత్ తమిళ సినీ పరిశ్రమలో తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి అడుగు పెట్టి, డీఎండీకే పార్టీని స్థాపించారు. ఆయన రీసెంట్ గా దీపావళిని తన కుటుంబంతో కలిసి ఇంట్లో జరుపుకుని సోషల్ మీడియాలోని తన ఖాతాలో ఆ ఫోటోలను కూడా షేర్ చేశాడు.
-
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్












Click it and Unblock the Notifications