మార్నింగ్ షోస్ వేస్తే కఠిన చర్యలు: ప్రభుత్వ హెచ్చరిక

ఇళయ దళపతి విజయ్, దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో లియో సినిమా వస్తోంది. కేవలం 6 నెలల్లోనే ఈ చిత్రం షూటింగ్ ను పూర్తిచేసుకుంది. పాన్ ఇండియా బాక్సాఫీస్ ను లక్ష్యంగా ఎంచుకొని ఈనెల 19వ తేదీన విడుదల కాబోతోంది. అయితే ఈ సినిమా విడుదలకు సంబంధించి మాత్రం అనేక ఇబ్బందులను ఎదుర్కొంటోంది.

కఠిన చర్యలు తీసుకుంటాం: సొంత రాష్ట్రం తమిళనాడులో ఎర్లీగా మార్నింగ్ షోస్ వేయడాన్ని అక్కడి ప్రభుత్వం నిషేధించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉదయం ఆటలకు ప్రభుత్వం అనుమతివ్వడానికి నిరాకరించింది. అనుమతి లేకుండా ఎవరైనా మార్నింగ్ షోస్ వేస్తే థియేటర్ యాజామాన్యంపై కఠిన చర్యలు తీసుకోవడానికి సిద్ధమైంది. ఇది ఈ సినిమా యూనిట్ కు పెద్ద దెబ్బేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

tamil nadu government ban to leo movie morning shows

దర్శకుడి క్రేజ్ మీదే: తెలుగుకు సంబంధించి మంచి థియేటర్లు రావడంతోపాటు బుకింగ్స్ కూడా పర్వాలేదనే స్థాయిలో జరుగుతున్నాయి. వాస్తవానికి ఈ సినిమాకు ఇంత గుర్తింపు రావడానికి ప్రధాన కారణం లోకేష్ కనగరాజ్. తన క్రేజ్ వల్లే తెలుగులో కూడా మంచి బుకింగ్స్ జరుగుతున్నాయి. తెలుగు, తమిళం, మళయాళంలోనే విడుదలవుతోంది. హిందీ బెల్టులోని మల్టీప్లెక్స్ ల్లో లియో విడుదల కావడంలేదు.

దీంతో థియేట్రికల్ వ్యాపారానికి నష్టాలు తప్పవని అంచనా వేస్తున్నారు. హిందీలో ఈ సినిమా ప్రమోషన్స్ కూడా అంతంతమాత్రంగానే ఉన్నాయి. తెలుగు, తమిళం, మళయాళంలో మాత్రం థియేటర్ వ్యాపారానికి ఎటువంటి ఇబ్బంది లేదు. మంత్రి ఉదయనిధి స్టాలిన్ సంస్థకు ఈ సినిమా హక్కులు ఇవ్వకపోవడంవల్లే ప్రభుత్వం మార్నింగ్ షోస్ కు మోకాలడ్డుతోందనే వార్తలు వస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+