నాని హిట్ 3 లో తమిళ్ స్టార్ హీరో.. డైరెక్టర్ ఎమోషనల్ పోస్ట్ !
నేచురల్ స్టార్ నాని.. ఓ పక్క హీరోగా.. మరో పక్క నిర్మాతగా ఫుల్ జోష్ లో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం శైలేష్ కొలను దర్శకత్వంలో హిట్ 3 థర్డ్ కేస్ మూవీలో నటిస్తూ, నిర్మిస్తున్నాడు నాని. ఈ చిత్రంలో హీరోయిన్ గా కేజీఎఫ్ హీరోయిన్ శ్రీనిధి శెట్టి నానికి జోడీగా నటించింది. మే 1 న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కాబోతున్న ఈ చిత్రం పై భారీ ఆశలే పెట్టుకున్నాడు నాని.
ఇప్పటికే రిలీజ్ అయిన హిట్ 3 టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. టీజర్ గమనిస్తే.. శ్రీనగర్ నేపథ్యంలో జరిగే ఈ కథలో ఒకేలా వరుస హత్యలు జరుగుతుండడం ఆ కేసును అర్జున్ సర్కార్‌కు అప్పగించడం చూడవచ్చు. యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన హిట్ 3 ట్రైలర్ అందరిని ఆశ్చర్యపరించింది. నేచురల్ స్టార్ కాస్త మోస్ట్ వైలెంట్ స్టార్ గా మారాడనే కామెంట్స్ వినిపించాయి. అలానే ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందిస్తున్నారు. రీసెంట్ గానే ఒక మెలోడీ సాంగ్ రిలీజ్ అవ్వగా మంచి రెస్పాన్స్ లభిస్తోంది.

హీరోగా దసరా, హాయ్ నాన్న, సరిపోదా శనివారంతో హ్యాట్రిక్ హిట్లు అందుకున్నాడు. అలానే నిర్మాతగా కూడా రీసెంట్ గానే 'కోర్'టు సినిమాని రిలీజ్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ సాధించాడు. దీంతో ఇన్నాళ్లు లవ్ స్టోరీస్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సినిమాలు చేసిన నాని దసరాతో రూట్ మార్చి.. సరిపోదా శనివారం చిత్రంతో కంటిన్యూ చేశాడు. హిట్ సినిమాతో విజయ పరంపర కొనసాగించాలని కోరుకుంటున్నారు. ఇక ప్రస్తుతం హిట్ 3 సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ టాలీవుడ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది.
ఈ సినిమాలో నానితో పాటు మరొక స్టార్ హీరో కూడా నటిస్తున్నాడని టాక్ నడుస్తోంది. కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ ఈ చిత్రంలో ముఖ్య పాత్రలో నటించబోతున్నారని గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. అటు కార్తీకి కూడా తమిళంతో పాటు టాలీవుడ్ లో మంచి మార్కెట్ ఉంది. త్వరలోనే అందుకు సంబంధించి త్వరలోనే అధికారకే ప్రకటన రానుందని భావిస్తున్నారు. అయితే హిట్ 3 లో ఆయన ఉన్నారా ? లేదా అనే విషయం చాలా ఆసక్తి రేపుతున్న తరుణంలో మూవీ యూనిట్ మాత్రం సైలెంట్ గా ఉంటుంది.
కానీ ఇప్పుడు అనూహ్యంగా మూవీ డైరెక్టర్ శైలేష్ కొలను చేసిన పోస్ట్ తో ఈ విషయం నిజమే అని సర్వత్రా చర్చ జరుగుతోంది. ఆ మేరకు ఆ పోస్టులో.. సినిమాకి సంబంధించిన ఓ న్యూస్ తెలిస్తే దాన్ని ముందు వెనక ఆలోచించకుండా లీక్ చేసేందుకు ఒక్క సెకను కూడా ఆలోచించట్లేదని వాపోయారు. ప్రేక్షకులకు మంచి అనుభూతి ఇచ్చేందుకు తెర వెనుక ఎంతోమంది పగలు రాత్రి తేడా లేకుండా కష్టపడుతుంటారు. స్పెషల్ మూమెంట్స్, సర్ప్రైజ్ లు ఇచ్చేందుకు ఎన్నో ప్లాన్ చేసుకుంటామని అన్నారు.
కానీ కొందరు వారి వారి స్వార్ధం కోసం అలాగే మరికొందరు జర్నలిస్టులు రీచ్ కోసం గోప్యంగా ఉంచాల్సిన విషయాలను లీక్ చేయడం బాధాకరమని వాపోయారు. ఏది లీక్ చేయకూడదు, ఏది లీక్ చేయాలనే బేసిక్ సెన్స్ ఉండాలి అంటూ మండిపడ్డారు. ఇలా చేయడం తప్పో.. ఒప్పో మీకు మీరే ఆలోచించుకోకుండి. ఈ రకమైన రిపోర్టింగ్ కేవలం చిత్ర బృందం కష్టాన్ని దొంగిలించడం కాదు, ఇది ప్రేక్షకుల నుండి నేరుగా దొంగిలించడంతో సమానం అని పోస్ట్ చేసారు.
For every single moment of excitement that is experienced in the cinemas by our audience, there is a story of a huge team working relentlessly for days and nights together, slogging beyond their physical capabilities. All for that moment of impact that we want to create in the…
— Sailesh Kolanu (@KolanuSailesh) April 3, 2025
హిట్ ఫ్రాంచైజీలో వరుసగా సినిమాలు వస్తుండగా ఫస్ట్ కేసులో విశ్వక్ సేన్, సెకండ్ కేసులో అడవి శేష్ నటించారు. ఇప్పుడు హిట్ 3 లో నానితో పాటు.. అడవి శేష్ కూడా కనిపిస్తారని రీసెంట్ గానే లీక్ ఇచ్చారు. అయితే నాని ఎలా అయితే హిట్ 2 క్లైమాక్స్ లో కనిపించారో అలానే హిట్ 3 చివర్లో.. 'హిట్ 4'లో హీరోని రివీల్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. దాంతో కార్తీ నటిస్తున్నాడన్న సంగతి మొదటి నుంచి సీక్రెట్ గా ఉంచితే.. ఇలా లీక్ అవ్వడం పట్ల డైరెక్టర్ కాస్త అసహనానికి గురయ్యాడని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ సినిమా తర్వాత శ్రీకాంత్ డైరెక్షన్ లో 'ది ప్యారడైజ్', సుజీత్ డైరెక్షన్ లో కూడా ఒక మూవీ చేస్తున్నారు.
నాని పుట్టిన రోజు సందర్భంగా 'ది ప్యారడైజ్'మూవీ నుంచి రిలీజ్ చేసిన గ్లింప్స్ సైతం సెన్సేషన్ గా మారాయి. నాని గత చిత్రాలకు పూర్తి భిన్నంగా రా అండ్ రస్టిక్ మోడ్ లో నాని కనిపించారు. ముఖ్యంగా సినిమా విజువల్స్ వేరే ప్రపంచానికి మనల్ని తీసుకువెళితే.. అసభ్య పదజాలం మాత్రం ఊహించని షాక్ ఇచ్చింది. నాని సినిమాలో ఈ తరహా డైలాగ్ ఏంటి అని ఒకింత షాక్ అయ్యారు. ఈ చిత్రాన్ని సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నాడు. దసరా లాంటి భారీ హిట్ తరువాత నాని - శ్రీకాంత్ ఓదెల కాంబోలో వస్తున్న చిత్రం కావడంతో మొదటి నుంచి అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు.












Click it and Unblock the Notifications