వద్దంటున్నా నాగచైతన్యకు గోరుముద్దలు తినిపించిన సాయిపల్లవి

తన అద్భుతమైన నటనతో, డ్యాన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న సాయిపల్లవి పుట్టినరోజును పురస్కరించుకొని తండేల్ చిత్ర యూనిట్ ఒక స్పెషల్ వీడియో విడుదల చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇది ట్రెండ్ అవుతోంది. సాయిపల్లవికి అందరూ పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ క్లిప్పింగ్ లో తమ అభిమాన నటిని చూసుకుని ఫ్యాన్స్ మురిసిపోతున్నారు.

ఇప్పటివరకు అందరూ సాయిపల్లవి నటన చూసివుంటారు.. కానీ సీన్ కట్ చెప్పిన తర్వాత ఎలా ఉంటుందో చూస్తారా అంటూ ఫన్నీ మూమెంట్స్ ను ఈ వీడియోలో చూపించారు. ఆమె నవ్వితే మనం నవ్వుతాం.. ఆమె ఏడిస్తే మనం ఏడుస్తాం.. అంటూ విభిన్నమైన షేడ్స్ లో ఉన్న సాయిపల్లవిని ఈ వీడియోలో చూపించారు. చివరకు నాగచైతన్య చాలు.. చాలు.. అంటున్నా అన్నం తినిపించింది. ఇంకా ఎంత తినిపిస్తావు అన్నా సరే అన్నం పెడుతూనే ఉంది ఈ నేచురల్ బ్యూటీ. నిజంగా నాగచైతన్యకు సాయిపల్లవి జీవిత భాగస్వామి అయితే ఎంతో బాగుంటుంది.. ఈ ఇద్దరూ చూడముచ్చటగా ఉన్నారంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

tandel movie unit released to saipallavi birthday special video

ప్రస్తుతం నాగచైతన్య తండేల్ మూవీ చేస్తున్నారు. గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు. చందు మొండేటి దర్శకుడు. పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయబోతున్నారు. శ్రీకాకుళం ప్రాంతంలో నివసించే జాలర్ల జీవితాలను అధ్యయనం చేసి కథను తయారుచేసుకున్న దర్శకుడు దాన్ని తెరకెక్కిస్తున్నాడు. భారతదేశానికి చెందిన జాలర్లు పాకిస్తాన్ దేశానికి చిక్కితే వారిని విడిపించి తీసుకువచ్చే సాహసవీరుడిగా నాగచైతన్య నటిస్తున్నారు. నాగచైతన్య ప్రేమించే అమ్మాయిగా సాయిపల్లవి నటిస్తోంది. వీరిద్దరికి ఇది రెండో సినిమా. మొదటి సినిమా లవ్ స్టోరీ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+