నానా పటేకర్ మరణంతో మళ్లీ తెరపైకి పాత వివాదం.. ఆ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!

ప్రముఖ దిగ్గజ నటుడు నానా పటేకర్(75) గురువారం ఉదయం గోవాలోని తన నివాసంలో గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన అకస్మాత్తుగా మరణించారనే వార్త సినీ పరిశ్రమతో పాటు యావత్ దేశాన్ని తీవ్ర శోకసంద్రంలో ముంచెత్తింది. ఈ సందర్భంగా గతంలో నానా పటేకర్‌పై తీవ్రమైన ఆరోపణలు చేసిన నటి తనుశ్రీ దత్తా స్పందిస్తూ ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు.

నానా పటేకర్ ఆస్తులు ఇన్ని కోట్లా?.. కానీ సింపుల్ లైఫ్‌స్టైల్ తెలిస్తే షాకవ్వాల్సిందే!
నానా పటేకర్ ఆస్తులు ఇన్ని కోట్లా?.. కానీ సింపుల్ లైఫ్‌స్టైల్ తెలిస్తే షాకవ్వాల్సిందే!

తనుశ్రీ దత్తా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో స్పందిస్తూ.. "నేను ఈ వార్తను విన్నాను. ఈ రోజు నాకు లక్నోలో ఓ ముఖ్యమైన కార్యక్రమం ఉంది. దాంతో నా పనిపై దృష్టి పెట్టడానికి ప్రయత్నిస్తున్నాను. ప్రస్తుతం మీడియా అంతా ఈ అంశాన్ని కవర్ చేయడంలో బిజీగా ఉండే అవకాశం ఉన్నందున నా స్పందన తెలియజేస్తున్నాను. దీనిపై ఎలా స్పందించాలో ఇంకా ఆలోచిస్తున్నాను. అయితే ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను" అని వ్యాఖ్యానించారు.

Tanushree Dutta Reacts to Nana Patekar Death Expresses Condolences and details of past MeToo allegations

2018లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మీటూ ఉద్యమ సమయంలో తనుశ్రీ దత్తా.. నానా పటేకర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. 2008లో 'హార్న్ ఓకే ప్లీజ్' సినిమాలోని ఓ పాట చిత్రీకరణ సందర్భంగా నానా పటేకర్ తన పట్ల అనుచితంగా ప్రవర్తించారని ఆమె ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను నానా పటేకర్ మొదటి నుంచీ ఖండిస్తూనే వచ్చారు. ఈ కేసు దర్యాప్తులో తగిన ఆధారాలు లేకపోవడంతో మేజిస్ట్రేట్ కోర్టు ఈ ఫిర్యాదును కొట్టివేసింది.

భారత్-పాకిస్తాన్ మ్యాచ్ ఆడాలా వద్దా?: నానా పటేకర్ తెగేసి చెప్పిన మాటిదే!
భారత్-పాకిస్తాన్ మ్యాచ్ ఆడాలా వద్దా?: నానా పటేకర్ తెగేసి చెప్పిన మాటిదే!

75 ఏళ్ల వయసులో ఉన్న నానా పటేకర్ గురువారం తెల్లవారుజామున గోవాలోని తన ఇంట్లో ఛాతీ నొప్పితో అపస్మారక స్థితిలో కనిపించారు. వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించి వైద్యులు దాదాపు 45 నిమిషాల పాటు సీపీఆర్ ద్వారా కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఉదయం 5.20 గంటలకు ఆయన మరణించినట్లు వైద్యులు నిర్దారించారు. ఇండియన్ సినిమాకు ఆయన అందించిన సేవలకు గాను మహారాష్ట్ర ప్రభుత్వం ఆయనకు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+