సల్మాన్ ఖాన్ షో లో టీమీండియా స్టార్ క్రికెటర్ మాజీ భార్య...
హిందీ బిగ్‌బాస్ 18వ సీజన్ త్వరలోనే ప్రారంభంకానుంది. ఈ తరుణంలోనే ఈ షోకు సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ రియాలిటీ షోకు బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, తాజాగా, ఈ షోలో టీమీండియా స్టార్ క్రికెటర్ హార్థిక్ పాండ్యా మాజీ భార్య నటాషా స్టాంకోవిచ్‌ను సందడి చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో కూడా ఓసారి బిగ్‌బాస్ హిందీ రియాలిటి షోలో బాలీవుడ్ బ్యూటీ శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా పాల్గొననున్నట్లు వార్తలొచ్చాయి. ఇప్పడు మరోసారి హార్థిక్‌పాండ్యా మాజీ భార్య రాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఈ న్యూస్ కాస్త నెట్టింట తెగ వైరల్‌గా మారిందిజ
హింది 'బిగ్ బాస్ 18' ప్రోమో వీడియో కంటే ముందే షో సంబంధించి సోషల్‌మీడియాలో అనేక ఊహాగానాలు తెగ చెక్కర్లు కొడుతున్నాయి. బిగ్‌బాస్ నిర్వాహకులు ప్రముఖ క్రికెటర్ హార్దిక్ పాండ్యా మాజీ భార్య నటాషా స్టాంకోవిచ్‌ను సంప్రదించినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ పేర్లను వెల్లడించలేదు. దీంతో బిగ్‌బాస్ హౌస్‌లోకి ఈసారి ఎవరెవరూ అడుగుపెడతారా? అని ఆసక్తి నెలకొంది.

కేవలం నటాషా స్టాంకోవిచ్‌ను మాత్రమే కాదు, ఆమె బాయ్‌ఫ్రెండ్ అలెగ్జాండర్ అలెక్స్ ఇలిక్ కూడా బిగ్‌బాస్‌లో కనిపించనున్నారని వార్తలు వస్తున్నాయి. బిగ్‌బాస్ మేకర్స్ అతన్ని కూడా సంప్రదించినట్లు న్యూస్ ప్రచారంలో ఉంది. అయితే ఈ షోలో హార్దిక్ మాజీ భార్య నటాషా రాకకు సంబంధించిన వార్తలపై ఎలాంటి క్లారిటీ లేదు. ఇటు బిగ్‌బాస్ మేకర్స్ కానీ, నటాషా నుండి కానీ ఎటువంటి అధికారిక ప్రకటనా రాలేదు. ఈ వార్త వాస్తవమో కాదో తెలియాలంటే మాత్రం మరికొద్దిరోజులు వేచి చూడాల్సిందే.












Click it and Unblock the Notifications