టీమ్ సలార్ సంచలనం: పీవీఆర్ ఐనాక్స్ థియేటర్లల్లో సినిమా విడుదల చేయకూడదని నిర్ణయం

Salaar: యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం.. సలార్. ఈ నెల 22వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకుడు. హొంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరగందూర్ ఈ సినిమాను నిర్మించారు. మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్, శృతి హాసన్, జగపతిబాబు, బాబీ సింహా, టిన్నూ ఆనంద్.. ఇతర కీలక పాత్రల్లో నటించారు.

సుమారు 400 కోట్ల రూపాయల వ్యయంతో పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా తెరకెక్కింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఒకేసారి విడుదల కాబోతోంది. ఆదిపురుష్ తరువాత ప్రభాస్ నటిస్తోన్న మూవీ ఇదే కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదల అయిన ట్రైలర్.. మంచి హైప్‌ను క్రియేట్ చేసింది.

 Team salaar decided to not screen the movie in pvrinox and miraj theatre

ఈ సినిమా విడుదలకు రెండు రోజుల ముందు సలార్ టీమ్ సంచలన నిర్ణయం తీసుకుంది. పీవీఆర్ ఐనాక్స్ (PVR Inox) చైన్ థియేటర్లల్లో ఈ సినిమా విడుదల చేయకూడదని నిర్ణయించింది. ఏపీ, తెలంగాణతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కడే గానీ పీవీఆర్ ఐనాక్స్ థియేటర్లల్లో సలార్ మూవీ విడుదల కావట్లేదు. మరో చైన్ థియేటర్స్ మిరాజ్‌లోనూ ఇదే పరిస్థితి. మిరాజ్ థియేటర్లల్లో కూడా సలార్ మూవీని రిలీజ్ చేయకూడదని తీర్మానించుకుంది.

దీనికి కారణాలు లేకపోలేదు. బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ నటించిన బిగ్ బడ్జెట్ మూవీ డంకీ (Dunki) విడుదల కాబోతోండటమే. సలార్ కంటే ఒక్క రోజు ముందు అంటే.. గురువారమే డంకీ విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ మూవీ కోసం ఉత్తరాది రాష్ట్రాల్లోని అన్ని పీవీఆర్ ఐనాక్స్, మిరాజ్ చైన్ థియేటర్లను డంకీ నిర్మాతలు బుక్ చేసుకున్నారు.

చివరికి పీవీఆర్ ఐనాక్స్, మిరాజ్‌కు చెందిన సింగిల్ స్క్రీన్ థియేటర్లను సైతం డంకీ నిర్మాతలు తమ సినిమా కోసం వాడేసుకున్నారు. పాన్ ఇండియా లెవెల్‌లో సలార్ విడుదల కాబోతోన్నప్పటికీ.. థియేటర్ల బుకింగ్ విషయంలో దీని విడుదల గురించి వారు ఏ మాత్రం పట్టించుకోలేదు.

 Team salaar decided to not screen the movie in pvrinox and miraj theatre

ఉత్తరాది రాష్ట్రాల్లోని ఎగ్జిబిటర్లు, పంపీణీదారులు కూడా సలార్ కంటే డంకీ సినిమాకే ప్రాధాన్యతను ఇచ్చారు. ఫలితంగా మల్టీ స్క్రీన్ థియేటర్లల్లో విడుదలకు నోచుకోవట్లేదు సలార్. దీనికి ప్రతిగా దక్షిణాది రాష్ట్రాల్లో గల పీవీఆర్ ఐనాక్స్, మిరాజ్ థియేటర్లల్లో తమ సినిమాను విడుదల చేయకూడదని సలార్ నిర్ణయించినట్లు హిందుస్థాన్ టైమ్స్ ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+