ప్రసాద్ ల్యాబ్స్ లో షో... 'హనుమాన్' మూవీ ఫస్ట్ రివ్యూ
టీజర్ దగ్గర నుండే ఆడియన్స్ ని విశేషంగా ఆకట్టుకుంది 'హనుమాన్'. తక్కువ బడ్జెట్ తో, చిన్న ఆర్టిస్టులతో దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ సినిమాకు ప్రస్తుతం స్టార్ హీరో సినిమాకన్నా ఎక్కువ క్రేజ్ ఏర్పడింది. బాలనటుడిగా అందరినీ మెప్పించిన తేజ సజ్జా హీరోగా మారి సూపర్ స్టార్ మహేష్ బాబు తో పోటీ పడే స్థాయికి ఎదుగుతాడని ఎవరూ ఊహించలేకపోయారు.
ఈనెల 12న గుంటూరు కారంతోపాటు హనుమాన్ కూడా విడుదలవుతోంది. నైజాంలో ఈ చిత్రాన్ని మైత్రీ మూవీస్ విడుదల చేస్తోంది. గుంటూరు కారం డిస్ట్రిబ్యూషన్ ను నిర్మాత దిల్ రాజు చేస్తున్నారు. హైదరాబాద్ లాంటి నగరంలో సింగిల్ స్క్రీన్లు 96 ఉండగా, అందులో 90 స్క్రీన్లలో గుంటూరు కారం విడుదల చేస్తున్నారు. దీనిపై పరిశ్రమ నుంచే కాకుండా సినీ ప్రేమికుల నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తమవుతోంది. దిల్ రాజు కావాలనే హనుమాన్ సినిమాకు అన్యాయం చేస్తున్నాడని, ఆ చిత్రాన్ని తొక్కేస్తున్నాడంటూ వార్తలు వస్తున్నాయి.

ఈ సినిమా నిర్మాత నిరంజన్ రెడ్డి కూడా ప్రెస్ మీట్ పెట్టి మరీ ఇవే ఆరోపణలు చేశాడు. అయినప్పటికీ అటువైపు నుంచి ఎటువంటి స్పందన లేదు. పరిశ్రమలో సినీ పెద్దలెవరూ లేకపోవడంతో ఎవరూ హనుమాన్ మూవీకి జరిగిన అన్యాయంపై మాట్లాడటంలేదు. హనుమాన్ నిర్మాత కూడా వెనక్కి తగ్గడంలేదు. సినిమా మీద నమ్మకం ఉంది కాబట్టే 12నే విడుదల చేస్తున్నామని, అదేరోజు హిందీలో ఈ చిత్రానికి 1200 థియేటర్లు కేటాయించారని, తెలుగులో ఇచ్చే నాలుగైదు థియేటర్ల కోసం 1200 థియేటర్లను పోగొట్టుకునే ఉద్దేశం లేదన్నారు.
తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ప్రివ్యూ షో ని ప్రసాద్ ల్యాబ్స్ లో మెగాస్టార్ చిరంజీవి తో పాటు పలువురు సినీ ప్రముఖలకు సినిమా చూపించారు. ఈ ప్రివ్యూ షోకు అద్భుతమైన స్పందన చ్చింది. టీజర్, ట్రైలర్ లో చూసినట్టుగానే సినిమా అద్భుతంగా వచ్చిందన్నారు. విడుదలయ్యేటప్పుడు చిన్న సినిమాగా విడుదలవుతున్నప్పటికీ తర్వాత మాత్రం పెద్ద సినిమాలకు వచ్చే రేంజ్ లో కలెక్షన్లు వస్తాయని, పెద్ద చిత్రాలను దాటవేస్తుందని, డైరెక్టర్ ప్రశాంత్ వర్మ అద్భుతంగా సినిమా తీశాడంటూ ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. క్లైమాక్స్ లో వచ్చే ఆంజనేయస్వామి సన్నివేశాలు హనుమాన్ చిత్రానికి హైలైట్ గా నిలిచాయని, కచ్చితంగా సినిమా చూసేవారికి సరికొత్త అనుభూతి కలుగుతందంటున్నారు. మరో నాలుగు రోజుల్లో ఈ సినిమా ఎలా ఉందనే విషయం తెలియనుంది.












Click it and Unblock the Notifications