టాలీవుడ్ యంగ్ హీరో తేజా సజ్జ పెళ్లి ఫిక్స్.. వధువు ఎవరంటే..?

టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ తేజ సజ్జా గురించి అందరికీ తెలిసిందే. చూడాలని ఉంది, రాజ కుమారుడు, యువరాజు, ఇంద్ర, ఠాగూర్ తదితర సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు తేజా సజ్జ. ఆ తర్వాత జాంబీ రెడ్డి సినిమాతో కెరీర్ లో తొలిసారి హీరోగా ఆరంగేట్రం చేశాడు. తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత ఇష్క్, అద్భుతం అనే సినిమాలతో మెప్పించాడు.

ఇక 2024 లో వచ్చిన హనుమాన్ అనే మూవీ తేజ సజ్జ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అలాగే పాన్ ఇండియా రేంజ్ లో సెన్సేషన్ సృష్టించింది హనుమాన్ మూవీ. ఆ తర్వాత 2025 లో వచ్చిన మిరాయ్ మూవీ కూడా పాన్ ఇండియా రేంజ్ లో సత్తా చాటింది. చిన్న వయసులోనే పాన్ ఇండియా రేంజ్ లో సూపర్ హీరో సబ్జెక్ట్స్ చేస్తూ ప్రేక్షకుల్ని అబ్బురపరుస్తున్నాడు తేజ సజ్జ. ప్రస్తుతం ఆయన హనుమాన్ 2 చిత్రంతో ఫుల్ బిజీగా ఉన్నాడు. అలాగే జాంబిరెడ్డి నెక్స్ట్ లెవెల్ అనే సినిమా కూడా చేస్తున్నాడు.

TejaSajja Tollywood young hero wedding is being fixed speculations going viral who is the bride

అయితే ఈ యంగ్ హీరో పెళ్లి ఫిక్స్ అయినట్లు సినీవర్గాల నుంచి క్రేజీ వార్త అందుతోంది. సినిమా ఇండస్ట్రీకి ఏమాత్రం సంబంధం లేని యువతిని తేజ సజ్జ వివాహం చేసుకోబోతున్నట్లు సమాచారం. సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా చేస్తున్న అమ్మాయితో పెద్దలు కుదిర్చిన పెళ్లికి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు స్పష్టం అవుతోంది. ఈ మేరకు ఈ ఏడాది నవంబర్ నెలలో కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం జరగబోతున్నట్లు సమాచారం. అలాగే డిసెంబర్ లో సన్నిహితులు, స్నేహితుల నడుమ ఉదయ్ పూర్ లో వివాహానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక త్వరలోనే ఈ గుడ్ న్యూస్ ను అభిమానులతో తేజ సజ్జ పంచుకోనున్నట్లు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+