కేంద్రమంత్రి రాజీనామా వెనుక బాలీవుడ్ నటికి వేధింపులు? అసలేం జరిగింది ?

కేంద్ర సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి ఎల్.మురుగన్ (L.Murugan) ఆకస్మితంగా చేసిన రాజీనామా దేశ రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. తమిళనాడులో బీజేపీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకే తాను మంత్రి పదవి నుంచి తప్పుకుంటున్నట్లు మురుగన్ ఇప్పటికే బహిరంగంగా ప్రకటించారు. అయినప్పటికీ, ఈ రాజీనామా నిర్ణయం వెనుక ఓ బాలీవుడ్ నటి చేసిన తీవ్రమైన ఆరోపణలు, పార్టీ అధిష్టానానికి వెళ్లిన ఫిర్యాదు ఉన్నాయనే వార్తలు వెలుగులోకి రావడం తీవ్ర కలకలం రేపుతోంది.

కాక్రోచ్ ల తిరంగా మార్చ్ పై ఢిల్లీ పోలీసుల కీలక నిర్ణయం-జూలై 20 రిపీట్ కాకుండా..!
కాక్రోచ్ ల తిరంగా మార్చ్ పై ఢిల్లీ పోలీసుల కీలక నిర్ణయం-జూలై 20 రిపీట్ కాకుండా..!

వివిధ జాతీయ మీడియా కథనాల ప్రకారం ఎల్. మురుగన్ నుంచి తనకు అనుచితమైన అశ్లీల సందేశాలు వచ్చాయని సదరు బాలీవుడ్ నటి బీజేపీ అగ్రనాయకత్వానికి నేరుగా ఫిర్యాదు చేశారని మనోరమ న్యూస్ కథనం తెలిపింది. ఈ వ్యవహారాన్ని అత్యంత తీవ్రమైన అంశంగా పరిగణించిన పార్టీ అధిష్టానం, ఆయనను తక్షణమే కేంద్ర మంత్రి పదవితో పాటు రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేయాలని ఆదేశించినట్లు సమాచారం. అధిష్టానం ఆదేశాల మేరకే ఆయన తన పదవులన్నింటికి రాజీనామా చేశారని తెలుస్తోంది.

Why Did L Murugan Resign Report Links Exit to Bollywood Actress s Complaint
కేంద్ర మంత్రి రాజీనామా..! ఢిల్లీ నిరసన వేళ అనూహ్య పరిణామం..!
కేంద్ర మంత్రి రాజీనామా..! ఢిల్లీ నిరసన వేళ అనూహ్య పరిణామం..!

వాస్తవానికి ఎల్.మురుగన్ రాజ్యసభ పదవీకాలం 2030 వరకు ఉంది. నాలుగేళ్ల గడువు ఉన్నా రాజ్యసభ సభ్యత్వాన్ని వదులుకోవడంపై గతంలో ఆయన ఎక్స్ లో స్పందించారు. దేశం మొదటిది, పార్టీ రెండోది, స్వంత ప్రయోజనం చివరిది అనే సిద్ధాంతానికి తాను కట్టుబడి ఉన్నానని తెలిపారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల నాటికి తమిళనాడులో బిజెపిని బలోపేతం చేయడానికి క్షేత్రస్థాయిలో స్వయంగా పనిచేయాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలసి రాజీనామా చేయాలనే తన అభిప్రాయాన్ని తెలియజేశానని, దానికి ప్రధాని అనుమతించారని చెప్పుకొచ్చారు. రానున్న రోజుల్లో తమిళనాడులోని వీధులు, గ్రామాలు, దేవాలయాల వేదికగా పర్యటనలు చేస్తానన్నారు. ప్రజలను, పార్టీ కార్యకర్తలను నేరుగా కలసి పనిచేస్తానని తెలిపారు. క్షేత్రస్థాయి పర్యటనల ద్వారా పార్టీకి కొత్త ఊపిరి పోసి, రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించడమే తన ప్రధాన లక్ష్యమన్నారు. అయితే బాలీవుడ్ నటి ఫిర్యాదే దీని వెనుక ఉన్నట్లు ఇప్పుడు బయటపడింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+