టీమిండియా మాజీ క్రికెటర్ కు బీజేపీ సర్కార్ గిఫ్ట్..! వాషింగ్ మెషీన్ ఫార్ములా..!

కేంద్రంలో నరేంద్ర మోడీ సర్కార్ అధికారంలోకి వచ్చాక విపక్షాలపై దర్యాప్తు సంస్థల్ని ప్రయోగించడం, నయానో, భయానో వారిని లొంగదీసుకోవడం, తమ పార్టీలో చేరాక, వారిపై ఉన్న కేసులన్నీ పక్కనబెట్టేయడం చూస్తూనే ఉన్నాం. ఇదే క్రమంలో గుజరాత్ కు చెందిన టీమిండియా మాజీ క్రికెటర్, బెంగాల్లో టీఎంసీ ఎంపీగా గెలిచిన యూసుఫ్ పఠాన్ (Yusuf Pathan) విషయంలోనూ మరోసారి అదే జరిగింది. వడోదరలో ఆయన స్థలం పక్కనే ఉన్న ప్లాట్ ను కబ్జా చేశారంటూ గతంలో కేసు పెట్టిన గుజరాత్ బీజేపీ ప్రభుత్వం.. ఇప్పుడు వారు చెప్పినట్లే వ్యవహరించడంతో క్లీన్ చిట్ ఇచ్చేయడమే కాకుండా , సదరు ప్లాట్ ను సైతం ఆయనకు గిఫ్ట్ గా కట్టబెట్టింది.

డీలిమిటేషన్ బిల్లుపై మరో అడుగు..! ఖర్గే డిమాండ్ పై స్పందించిన కేంద్రం..!
డీలిమిటేషన్ బిల్లుపై మరో అడుగు..! ఖర్గే డిమాండ్ పై స్పందించిన కేంద్రం..!

గుజరాత్ లోని వడోదరలో ఉన్న యూసుఫ్ పఠాన్ నివాసం సమీపంలో ఉన్న ఓ స్థలాన్ని గతంలో ఆయన ఆక్రమించుకున్నారని స్థానిక అధికారులు కేసు పెట్టారు. 978 చదరపు మీటర్ల విస్తీర్ణం కలిగిన ఈ స్థలం విలువ సుమారు రూ.20.53 కోట్లు. ఈ స్థలాన్ని తనకు కేటాయించాలంటూ పఠాన్ దరఖాస్తు చేసుకున్నా గతంలో పట్టించుకోలేదు. కానీ ఈ ఏడాది బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల తర్వాత టీఎంసీ ఓటమి పాలవ్వడంతో .. ఆ పార్టీకి గుడ్ బై చెప్పి 20 మంది ఎంపీలు బీజేపీ వ్యూహంలో భాగంగా త్రిపురకు చెందినఒకే ఒక్క ఎంపీ ఉన్న చిన్న పార్టీ ఎన్సీపీఐలో చేరిపోయారు. వారిలో యూసుఫ్ పఠాన్ కూడా ఉన్నారు.

Former Cricketer Yusuf Pathan Gets Disputed Vadodara Plot From Gujarat Months After TMC Exit
రైలు ప్రయాణికులకు సుప్రీం గుడ్ న్యూస్..! ఆఫ్ లైన్ టికెట్లకూ ఇన్సూరెన్స్..!
రైలు ప్రయాణికులకు సుప్రీం గుడ్ న్యూస్..! ఆఫ్ లైన్ టికెట్లకూ ఇన్సూరెన్స్..!

దీంతో యూసుఫ్ పఠాన్ ఇలా తాము చెప్పిన విధంగా పార్టీ మారినందుకు గిఫ్ట్ గా వదోదరలో ఏ స్థలం అయితే ఆయన ఆక్రమించుకున్నారని గతంలో కేసులు పెట్టారో, అదే స్థలాన్ని ఆయనకు కట్టబెట్టాలని గుజరాత్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు వడోదరలో వివాదాస్పద 978 చదరపు మీటర్ల స్థలాన్ని యూసుఫ్ పఠాన్‌కు కేటాయించేందుకు ఆమోదం తెలిపింది. ఈ మేరకు నగర పాలక సంస్థకు అవసరమైన ఆదేశాలు జారీ చేశారు. యూసుఫ్ పఠాన్ తన ఇంటి పక్కనే ఉన్న ఈ ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకునేందుకు వీలుగా, తుది ఆమోదం కోసం ప్రక్రియ కొనసాగుతోంది. వేలం కోసం కనీస ధరను నిర్ణయించిన తర్వాత, ఈ స్థలాన్ని పఠాన్‌కు కేటాయించే ప్రతిపాదనను స్థానిక నగర పాలక సంస్థ స్టాండింగ్ కమిటీ ముందు ఉంచుతారు. కమిటీ ఆమోదం పొందిన తర్వాత మొత్తం ప్రక్రియ పూర్తవుతుంది. ఈ స్థలం కోసం పఠాన్ ఎంత చెల్లించాలనేది ఇంకా ఖరారు కాలేదు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను పరిశీలించిన తర్వాత, నగర పాలక సంస్థ ఈ మొత్తాన్ని నిర్ణయిస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+