"క్లిష్ట పరిస్ధితుల్లో మోడీ-"జ్ఞానేష్ ను తప్పించినా ..!" సుప్రీం మాజీ జడ్జి షాకింగ్ రీజన్స్..!

ప్రత్యేక ఓటర్ల జాబితాల సవరణ ప్రక్రియ (SIR)లో అక్రమాలకు పాల్పడి 13 కోట్ల మంది ఓటర్లను తొలగించేందుకు కారణమయ్యారంటూ సీఈసీ జ్ఢానేష్ కుమార్ రాజీనామా కోసం విపక్షాలు, కాక్రోచ్ జనతా పార్టీ, విద్యార్ది సంఘాలు పట్టుబడుతున్నాయి. ఈ మేరకు ఢిల్లీలో నిరంతరం ఆందోళనలు చేపడుతున్నాయి. అయితే కేంద్రం మాత్రం జ్ఞానేష్ కుమార్ అభిశంసనకు ముందుకు రావడం కానీ, ఆయనతో నేరుగా రాజీనామా చేయించాలని కానీ ఆలోచించడం లేదు. దీంతో ఈ వ్యవహారం మోడీ సర్కార్ మెడకు చుట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మార్కండే కట్జూ స్పందించారు.

సీఈసీని తప్పించినా ఈ ఆందోళనలు ఆగే అవకాశం లేదని సుప్రీం మాజీ జడ్జి జస్టిస్ మార్కండే కట్జూ (Justice Katju) తేల్చిచెప్పేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్ లో ఓ ట్వీట్ చేశారు. ప్రస్తుతం భారతదేశంలో జరుగుతున్న ఆందోళన జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోసమేనని, పరిస్థితిని సద్దుమణిగేలా చేయడానికి, ఆయనతో రాజీనామా చేయించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉండవచ్చని కట్జూ అంచనా వేశారు. అయితే, ప్రభుత్వం అలా చేసినంత మాత్రాన ఈ ఆందోళన ముగిసిపోదన్నారు. ఆ తర్వాత, ఎస్‌ఐఆర్ (SIR)ను రద్దు చేయాలని, ఓటర్ల జాబితా నుండి తొలగించిన 13 కోట్ల మంది ఓటర్ల పేర్లను తిరిగి చేర్చాలని నిరసనకారులు డిమాండ్ చేస్తారని తెలిపారు.

Justice Katju Warns Gyanesh Kumar s Resignation May Not End Agitation Flags Next Demand to Scrap SIR

ఒకవేళ కేంద్ర ప్రభుత్వం దానికి కూడా అంగీకరిస్తే, మరో కొత్త డిమాండ్ తెరపైకి వస్తుందని జస్టిస్ కట్జూ తెలిపారు. ఇలా ఇది కొనసాగుతూనే ఉంటుందన్నారు. దీనికి అంతం ఉండదన్నారు. దీన్ని బట్టి చూస్తే కేంద్రంలో మోదీ ప్రభుత్వం ప్రస్తుతం చాలా క్లిష్టమైన, అసౌకర్యకరమైన పరిస్థితిలో ఉందని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి విశ్లేషించారు. మరోవైపు ఈ పరిస్దితి నుంచి బయటపడేందుకే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని, డీలిమిటేషన్, మహిళా బిల్లుల్ని తెరపైకి తెచ్చి విపక్షాల్లో కొన్నింటిని తమవైపుకు తిప్పుకోవాలని ప్రధాని మోడీ భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎప్పుడో రెండు నెలల క్రితమే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగిసినా ఇప్పటివరకూ ఉభయసభల్ని ప్రోరోగ్ చేయకుండా కేంద్రం జాప్యం చేస్తుండటాన్ని రాజ్యసభలో విపక్ష నేత మల్లిఖార్జున్ ఖర్గే, లోక్ సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ ప్రశ్నిస్తున్నారు. అయినా కేంద్రం స్పందించడం లేదు.

Take a Poll

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+