చైనా చరిత్రలోనే సంచలన పన్ను చట్టం.. ఉలిక్కిపడిన బిలియనీర్లు

చైనాలో సంపన్నుల ఆటలు ఇక సాగవు. ఇప్పటివరకు తమ వ్యాపార సామ్రాజ్యాన్ని దేశంలో విస్తరించి, సంపాదించిన వేల కోట్ల రూపాయల సంపదను విదేశీ ట్రస్టుల ద్వారా విదేశాల్లో దాచుకుంటూ పన్నులు ఎగవేస్తున్న కుబేరులకు డ్రాగన్ ప్రభుత్వం గట్టి షాకిచ్చింది. ప్రపంచాన్ని శాసిస్తున్న చైనా బిలియనీర్లకు చెందిన దాదాపు 140 బిలియన్ డాలర్ల (సుమారు రూ.11 లక్షల కోట్లు) విదేశీ ఆస్తులు ఇప్పుడు కొత్తగా అమల్లోకి వస్తున్న పన్ను నిబంధనల పరిధిలోకి రానున్నాయి. విదేశీ ట్రస్టుల ద్వారా ఆర్జిస్తున్న లాభాలపై కఠినమైన 20 శాతం పన్నును వసూలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అక్టోబర్ 22 లోపు తమ వివరాలను లెక్కగట్టి, ఎలాంటి జరిమానాలు లేకుండా పన్ను చెల్లించాలని ప్రభుత్వం డెడ్‌లైన్ విధించడంతో చైనా వ్యాపార వర్గాల్లో ప్రకంపనలు రేగావు.

బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్‌లో ఆస్తులు దాచిన టాప్ బిలియనీర్లు

చైనాకు చెందిన ఎనిమిది మంది ప్రపంచ కుబేరులు ఎక్కువగా ఈ పన్ను నిబంధనల వల్ల ప్రభావితమయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. నెట్‌ఈజ్ (NetEase) వీడియో గేమ్స్ కంపెనీ అధినేత విలియం డింగ్ విదేశాల్లో సుమారు 37 బిలియన్ డాలర్లు, ఈ-కామర్స్ దిగ్గజం పీడీడీ హోల్డింగ్స్ అధినేత కొలిన్ హువాంగ్ 29 బిలియన్ డాలర్ల సంపదను విదేశీ గడ్డపై కలిగి ఉన్నారు. బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్, కేమన్ ఐలాండ్స్ వంటి ట్యాక్స్ హేవెంట్స్ కేంద్రంగా వీరు ఈ ట్రస్టులను నడిపిస్తున్నారు. చైనా ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఈ దిగ్గజాల సంపద భారీగా పన్ను పరిధిలోకి రానుంది.

Wealthy Chinese Entrepreneurs Face Strict Tax Rules as Government Targets Overseas Offshore Trusts
Xi Jinping: దశాబ్దం తర్వాత వైట్‌హౌస్ మెట్లు ఎక్కబోతున్న చైనా బాస్
Xi Jinping: దశాబ్దం తర్వాత వైట్‌హౌస్ మెట్లు ఎక్కబోతున్న చైనా బాస్

ఉమ్మడి సమృద్ధి పేరుతో కఠిన చర్యలు.. ఖజానా నింపుకునే ప్లాన్

చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'కామన్ ప్రాస్పెరిటీ' ప్రచారంలో భాగంగానే ఈ సరికొత్త పన్ను విధానాన్ని కఠినంగా అమలు చేస్తున్నారు. గత కొంతకాలంగా దేశంలో రియల్ రంగం కుదేలు కావడం, స్థానిక ప్రభుత్వాల ఆదాయం గణనీయంగా పడిపోవడంతో ప్రత్యామ్నాయ ఆదాయ వనరులపై చైనా ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగానే విదేశాల్లో మూలుగుతున్న కుబేరుల సంపదను గురిపెట్టింది. ఇప్పటికే కొన్ని కంపెనీల వ్యవస్థాపకులు ఈ పన్నుల చెల్లింపుల కోసం తమ షేర్లను విక్రయించి నగదును సమకూర్చుకునే పనిలో పడ్డారు.

మళ్లీ వర్షాలు! ఆసియాను చుట్టేసిన భారీ మేఘాల వలయం..
మళ్లీ వర్షాలు! ఆసియాను చుట్టేసిన భారీ మేఘాల వలయం..

తప్పించుకోవడం అసాధ్యం.. ఉలిక్కిపడిన చైనా సంపన్నులు

అధికారులు పబ్లిక్‌గా ఎవరి పేర్లను వెల్లడించనప్పటికీ, పబ్లిక్ ఐపీఓ డాక్యుమెంట్లు, ఇతర ఆర్థిక లావాదేవీల ఆధారంగా ఎవరికి ఎంత పన్ను పడాలో లెక్కించడం ప్రభుత్వానికి పెద్ద కష్టమేమీ కాదు. విదేశీ పాస్‌పోర్టులు ఉన్నప్పటికీ, చైనాలోనే వ్యాపారాలు చేస్తూ అక్కడే ఆదాయం ఆర్జిస్తున్న ప్రతి ఒక్కరూ ఈ పన్ను చెల్లించాల్సిందేనని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఈ హఠాత్ పరిణామానికి చైనాలోని కుబేరులందరూ ఒక్కసారిగా షాక్ గురయ్యారని, చట్టపరంగా తప్పించుకునే దారిలేక ట్యాక్స్ నిపుణుల సలహాలు తీసుకుంటూ పన్నులు చెల్లించేందుకు సన్నద్ధమవుతున్నారని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+