వరంగల్-ఖమ్మం-నల్గొండ గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ బరిలో టీఆర్ఎస్..అభ్యర్థిని ప్రకటించిన కవిత!

తెలంగాణ రక్షణ సేన టీఆర్ఎస్‌ తొలిసారి ఎన్నికల బరిలోకి దిగుతోంది. వరంగల్‌-ఖమ్మం-నల్గొండ గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ స్థానం నుంచి పోటీకి సిద్ధమైంది. అభ్యర్థిగా నలమాస శ్రీకాంత్‌ గౌడ్‌ను పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఖరారు చేశారు. దసరా సందర్భంగా ఈ ప్రకటన చేశారు

ఉమ్మడి వరంగల్‌ జిల్లా, ప్రస్తుత మహబూబాబాద్‌ నర్సింహులపేట మండలం కౌసల్యాదేవిపల్లికి చెందిన శ్రీకాంత్‌ గౌడ్‌ కాకతీయ యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డీ పూర్తి చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో క్రియాశీలంగా పాల్గొన్న ఆయన, తెలంగాణ జాగృతి నుంచే కల్వకుంట్ల కవితతో కలిసి పని చేశారు. పార్టీ అధికార ప్రతినిధిగా టీవీ డిబేట్లు, ప్రజా సంఘాల సమావేశాల్లో టీఆర్ఎస్‌ గొంతుకగా నిలిచారు.

TRS MLC candidate Kavitha announced Candidate for Warangal-Khammam-Nalgonda Graduate MLC

బహుజనుల గొంతుకగా మూడేళ్లుగా పలు ఉద్యమాలకు రూపకల్పన చేసిన కవిత, అదే సంప్రదాయాన్ని ఈ అభ్యర్థి ప్రకటనలో కొనసాగించారని పార్టీ తెలిపింది. టీఆర్ఎస్‌ పేరుతో పార్టీని ప్రకటించిన తర్వాత ఎన్నికల్లో అభ్యర్థిని నిలపడం ఇదే తొలిసారి. దసరా శుభ ముహూర్తాన పార్టీ తరపున ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే మొదటి అభ్యర్థిగా శ్రీకాంత్‌ గౌడ్‌ పేరును కవిత ఖరారు చేశారు.

పార్టీ తరఫున ఈ ఎన్నికల కో-ఆర్డినేటర్‌, అబ్జర్వర్‌గా సయ్యద్‌ ఇస్మాయిల్‌ను నియమించినట్లు కూడా ప్రకటించారు. తెలంగాణ శాసనమండలిలోని రెండు పట్టభద్రుల నియోజకవర్గాలు - మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్‌, వరంగల్‌-ఖమ్మం-నల్గొండ - పదవీకాలం 2027 మార్చితో ముగియనుంది. ఈ రెండు స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించింది.

కోల్‌ఇండియా తరహాలో సింగరేణి అధికారులకు దసరా ధమాకా!
కోల్‌ఇండియా తరహాలో సింగరేణి అధికారులకు దసరా ధమాకా!

2026 నవంబర్‌ 1ని అర్హత తేదీగా నిర్ణయించి కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియను చేపట్టింది. నవంబర్‌ 6 వరకు పట్టభద్రుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. నవంబర్‌ 20 నాటికి ముసాయిదా ఓటర్ల జాబితా తయారీ పూర్తి చేసి, నవంబర్‌ 25న విడుదల చేయనున్నారు. నవంబర్‌ 25 నుంచి డిసెంబర్‌ 10 వరకు అభ్యంతరాలు స్వీకరించి, డిసెంబర్‌ 30న తుది ఓటర్ల జాబితా విడుదల చేయనున్నారు. ఏది ఏమైనా తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత పార్టీ నుండి ఎన్నికల బరిలో అభ్యర్థిని నిలపటం ఆసక్తికర పరిణామం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+