ఇక్కడ బఠానీలు అమ్మినట్లు సె**ను అమ్ముతున్నారు.. తెలుగు హీరోయిన్
తన అందం, నటనతో పాటు బోల్డ్ స్టేట్‌మెంట్‌లతో ఎప్పుడూ వార్తల్లో ఉండే నటి తేజస్వి మదివాడ కెరీర్ ఆసక్తికరంగా సాగింది.తేజస్వి కెరీర్ ఆరంభం ఒక మెగా ఎంట్రీ అనే చెప్పాలి. 2013లో మహేష్ బాబు, వెంకటేష్ నటించిన మల్టీస్టారర్ చిత్రం 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'తో ఆమె తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత 'మనం', 'హార్ట్ ఎటాక్', 'శ్రీమంతుడు' వంటి పెద్ద సినిమాల్లోనూ కీలక సహాయ పాత్రల్లో కనిపించి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది.
తేజస్వి కెరీర్‌కు మలుపునిచ్చిన చిత్రం సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన 'ఐస్ క్రీమ్' (2014). ఇందులో ఆమె సోలో హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా కమర్షియల్ సక్సెస్ సాధించింది. అయితే, ఈ సినిమాలో ఆమె చేసిన పాత్రలు, బోల్డ్ సన్నివేశాలు తేజస్వికి తక్కువ కాలంలోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టినా, కొన్ని సందర్భాల్లో ఇది మెయిన్‌స్ట్రీమ్ హీరోయిన్ అవకాశాలను తగ్గించిందని ఆమెనే స్వయంగా వ్యాఖ్యానించారు.

తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర కావడానికి తేజస్వి రియాలిటీ షోల బాట పట్టింది. ఆమె బిగ్‌బాస్ తెలుగు సీజన్ 2 (2018)లో ఒక కంటెస్టెంట్‌గా పాల్గొని ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఆ తర్వాత బిగ్‌బాస్ నాన్-స్టాప్ (ఓటీటీ ఎడిషన్)లో 'వారియర్' కంటెస్టెంట్‌గా మరోసారి సందడి చేసింది. అయితే, బిగ్‌బాస్ వల్ల తన కెరీర్ దెబ్బతిందని, సినీ అవకాశాలు తగ్గాయని ఆమె కొన్ని ఇంటర్వ్యూలలో వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది.
సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లు, టీవీ షోలలో కూడా తేజస్వి చురుకుగా పాల్గొంటోంది. 'మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు', 'కేరింత', 'సుబ్రమణ్యం ఫర్ సేల్' వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించిన ఆమె, తమిళ చిత్ర పరిశ్రమలో కూడా అడుగుపెట్టింది. ఇటీవల ఆమె 'అర్థమైందా అరుణ్ కుమార్' వంటి వెబ్ సిరీస్‌లతో పాటు 'రియాలిటీ రాణీస్ ఆఫ్ ది జంగిల్' వంటి రియాలిటీ షోల్లోనూ తన ఉనికిని చాటుకుంది.
తాజాగా తేజస్వి శృంగారంపై చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్‌గా మారాయి. తేజస్వి యాంకర్ నిఖిల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ...హైదరాబాద్ వంటి ప్రాంతంలో శృంగారం గురించి, ఆ సంబంధిత విషయాల గురించి చాలా రహస్యంగా మాట్లాడుకోవడం చూశానని, కానీ బ్యాంకాక్‌లో పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉందని తెలిపారు. అక్కడ వీధుల్లో బహిరంగంగా, ఎలాంటి దాపరికాలు లేకుండా బఠానీలు అమ్మినట్లు సెక్స్ అమ్ముతారని ఆమె బోల్డ్ కామెంట్ చేశారు.
అంతకుముందు ఒక రకంగా ఆలోచించిన తేజస్వి, బ్యాంకాక్‌లో చూసిన ఈ ఓపెన్ కల్చర్ కారణంగా తన మైండ్‌సెట్ పూర్తిగా మారిపోయిందని తెలిపారు. అప్పటి నుంచి ప్రపంచాన్ని ఒక కొత్త కోణంలో చూడటం మొదలుపెట్టానని, వివిధ ప్రదేశాలకు ప్రయాణించి కొత్త విషయాలు తెలుసుకోవాలనే కోరిక పెరిగిందని చెప్పారు.
ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి, కొత్త ఆలోచనలు, దృక్పథాలను అలవరచుకోవడానికి ప్రతి ఒక్కరికీ ప్రపంచ పర్యటన అవసరమని తేజస్వి గట్టిగా నమ్ముతున్నారు. ఈ విధంగా, తేజస్వి కేవలం సినిమాల ద్వారానే కాకుండా, తన బోల్డ్ పర్సనాలిటీ మరియు జీవితానుభవాల ద్వారా కూడా ప్రేక్షకులను ప్రభావితం చేస్తోంది.
-
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications