'పుష్ప-2' విడుదల వేళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న ప్రెస్టీజియస్ మూవీ 'పుష్ప-2' సినీ యావత్తు మొత్తం కూడా ఎంతో అతృతుగా ఎదురు చూస్తోంది. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ మరోసారి బాక్సాఫీస్ దగ్గర తన మ్యాజిక్ చూపించడానికి రెడీ అవుతున్నాడు. రికార్డులను బద్దలు కొట్టడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. దానికి తగ్గట్టుగానే ఈ చిత్ర ట్రైలర్ కట్ కూడా ఉండటంతో ఈ మూవీ కోసం నేషన్‌వైడ్‌గా అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు.

దీంతో 'పుష్ప-2'పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా ఈ సినిమా కోసం నార్త్ ఆడియెన్స్‌ ఎంతో అతృతుగా ఎదురు చూస్తున్నారు. బన్నీ తన మ్యానరిజంతో, యాక్టింగ్‌తో పుష్పను పాన్ ఇండియా స్థాయిలో నిలబెట్టేశాడు. నార్త్ ఆడియెన్స్‌కు పుష్ప బాగా ఎక్కేసింది. అందుకే పుష్ప అక్కడ వంద కోట్లు కొల్లగొట్టేసింది. దీంతో 'పుష్ప-2'పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా ఈ సినిమా కోసం నార్త్ ఆడియెన్స్‌ ఎంతో అతృతుగా ఎదురు చూస్తున్నారు. దీనికి తగ్గట్టుగానే సుకుమార్ ఈ సినిమాపై ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్టు తెలుస్తోంది. తాజాగా ఈ సినిమా టికెట్ల రేట్లను పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది. డిసెంబర్ 4న రాత్రి 9:30, అర్థరాత్రి ఒంటి గంటకు, బెనిఫిట్ షోలకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీటి ధరలను సింగిల్ స్క్రీన్ , మల్టీప్లెక్సీలో రూ.800లుగా ఖారారు చేసింది.

Telangana government has given permission to increase the ticket rates of Allu Arjun Pushpa-2 movie

ఇక డిసెంబర్ 5 నుంచి 8 వరకు సింగిల్ స్క్రీన్ రూ.150,మల్టీప్లెక్సీ రూ.200 చొప్పున పెంచుకునే అవకాశం కల్పించింది. డిసెంబర్ 9 నుంచి 16 వరకుసింగిల్ స్క్రీన్‌లకు రూ.105 రూపాయిలు, మల్టీప్లెక్సీలకు రూ.150 చొప్పున పెంచుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతినిచ్చింది. అయితే టికెట్ల రేట్ల పెంపుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. టికెట్ల ధరపై 100, 150 రూపాయిలు పెంచడం అంటే సామాన్యుడికి సినిమాను దూరం చేయడమే అని కామెంట్స్ వినిపిస్తున్నాయి. సినిమా విడుదలైన 10 రోజుల వరకు టికెట్ల పెంపు ఉండటంలో సినీ అభిమానులు అసంతృప్తితో ఉన్నారు. త్వరలోనే ఏపీ ప్రభుత్వం కూడా ఈ సినిమా టికెట్ల రేట్లను పెంచే అవకాశం ఉంది. ఈ సినిమా డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+