బ్లూ షర్ట్‌తో పోలింగ్ కేంద్రానికి జూనియర్ ఎన్టీఆర్: విజ్ఞప్తి చేసిన అల్లు అర్జున్

Allu Arjju, Jr NTR: తెలంగాణలో పోలింగ్‌ ఆరంభమైంది. ఈ ఉదయం సరిగ్గా 7 గంటలకు రాష్ట్రంలో గల 17 లోక్‌సభ నియోజకవర్గాలకు పోలింగ్ మొదలైంది. సాయంత్రం వరకు కొనసాగుతుంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటోన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరి నిల్చున్నారు.

పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసుల, కేంద్ర ఎన్నికల అధికారులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లను పూర్తి చేశారు. పోలింగ్ స్టేషన్ల వద్ద ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా ఉండటానికి అవసరమైన అన్ని చర్యలను యుద్ధ ప్రాతిపదికన తీసుకున్నారు.

Telangana Lok Sabha polls 2024 Jr NTR and Allu Arjun cast their vote

వీఐపీ జోన్‌గా పరిగణించే జూబ్లీహిల్స్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం వద్ద పలువురు ఓటర్లు బారులు తీరి నిల్చున్నారు. సికింద్రాబాద్ లోక్‌సభ పరిధిలోకి వచ్చే పోలింగ్ స్టేషన్ ఇది. పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటోన్నారిక్కడ. సినీ ప్రముఖులు, రాజకీయ, వ్యాపార వేత్తలు క్యూలో నిల్చుని మరీ ఓటు వేస్తోన్నారు.

టాలీవుడ్ హీరోలు అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ ప్రారంభమైన తొలి గంటలోనే వారు ఓటు వేశారు. పోలింగ్ ఆరంభమైన వెంటనే వారు తమ పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. అప్పటికే ఓటర్లు బారులు తీరి నిల్చోవడంతో వారితో పాటు క్యూ లైన్‌లో ఉన్నారు.

Telangana Lok Sabha polls 2024 Jr NTR and Allu Arjun cast their vote

జూనియర్ ఎన్టీఆర్ తన భార్య లక్ష్మీ ప్రణతితో కలిసి పోలింగ్ కేంద్రానికి వచ్చారు. తమవంతు వచ్చేంత వరకు వేచిచూశారు. అనంతరం ఓటు వేశారు. ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని వారు విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ లోక్‌సభ నుంచి ఎన్నికల బరిలో నిల్చున్న మాధవీలత తన ఓటు హక్కును వినియోంచుకున్నారు. ఏఐఎంఐఎం అభ్యర్థి, సిట్టింగ్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీపై ఆమె పోటీ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+