kiran abbavaram:తండ్రి కానున్న 'క' హీరో కిరణ్ అబ్బవరం.. ఫొటోలు వైరల్
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం రాజావారు.. రాణివారు(2019) సినిమాతో చిత్రసీమలో అడుగుపెట్టారు. నటి రహస్య ఈ సినిమాలో హీరోయిన్ గా నటించారు. ఆ తర్వాత ఎస్ ఆర్ కళ్యాణమండపం, సమ్మతమే చిత్రాలతో యువతకు దగ్గరయ్యారు. ఇటీవల విడుదలైన క చిత్రంతో కిరణ్ అబ్బవరం మంచి విజయాన్ని అందుకున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశాంతో తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు. ఈ చిత్రానికి సుదీప్, సందీప్ ద్వయం దర్శకత్వం వహించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 53కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి.. కిరణ్ అబ్బవరం కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్స్ సాధించిన చిత్రంగా నిలిచింది. ప్రస్తుతం కిరణ్ అబ్బవరం దిల్ రుబా మూవీలో నటిస్తున్నారు. ఈ మూవీ ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది.
లవ్ ఎట్ ఫస్ట్ సైట్..
కిరణ్ అబ్బవరం తొలి సినిమా రాజావారు రాణిగారు. ఇందులో రహస్య హీరోయిన్ గా నటించారు. షూటింగ్ సమయంలోనే ఇరువురి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత పరిచయం ప్రేమగా మారింది. ఆ తర్వాత దాదాపు ఐదేళ్లపాటు వీరిద్దరూ సీక్రెట్ రిలేషన్ షిప్ లో ఉన్నట్లు గుసగుసలు వినిపించాయి. అయితే 2024 ఆగస్టులో కుటుంబసభ్యులు, అతికొద్ది మంది అతిథుల సమక్షంలో వీరి వివాహం ఘనంగా జరిగింది.

గుడ్ న్యూస్ చెప్పిన కిరణ్ అబ్బవరం
అయితే తాజాగా కిరణ్ అబ్బవరం ఇన్ స్టా వేదికగా గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలో తాను తండ్రిని కాబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. మా ప్రేమ ఇంకా పెరుగుతుంది అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చాడు. ఇలాంటి హ్యాపీ మూమెంట్ లో మీ ఆశిస్సులు తమపై ఉండాలని కోరుకున్నారు. దీంతో అటు ఫ్యాన్స్, సెలబ్రిటీలు కంగ్రాట్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. నెటిజన్లు కిరణ్- రహస్య స్టార్ కపుల్స్ కు శుభాకాంక్షలు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications