తెలుగు హీరోయిన్ వీడియో వైరల్ !!
చిత్ర పరిశ్రమలో తనదైన గుర్తింపు తెచ్చుకున్న తెలుగు హీరోయిన్ లలో ఆమె ఒకరు "అనన్య నాగళ్ల". 'షాదీ' అనే వెబ్ సిరీస్ తో నటిగా కేరీర్ ప్రారంభించి.. 'మల్లేశం' మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే తనదైన నటనతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'వకీల్ సాబ్' సినిమాలో నటించే ఛాన్స్ దక్కించుకొని ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకుంది.
ఆ తర్వాత వరుసగా తంత్ర, పొట్టేల్, బహిష్కరణ (వెబ్ సిరీస్), శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ వంటి మూవీల్లో విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను మరింత ఆకట్టుకుంది. అలానే తెలుగుతో పాటు పలు భాషల్లో సైతం మంచి ఫేమ్ దక్కించుకోగలుగుతుంది అనన్య. ఆమె నటించిన చిత్రాలు అన్నీ వరుసగా మంచి టాక్ తెచ్చుకుంటుండడంతో నిర్మాతలు సైతం ఆమెతో సినిమాలు చేసేందుకు క్యూ కడుతున్నారు. రూ.5 కోట్ల లోపు బడ్జెట్‌తో రూపొందించే లేడీ ఓరియెంటెడ్ మూవీలకు అనన్య బెస్ట్ ఆప్షన్ అని ఫిక్స్ అయిపోతున్నారు. ఈ క్రమంలోనే ఈ తెలుగమ్మాయి బాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఓ హిందీ ప్రాజెక్టులో లీడ్ రోల్ ఛాన్స్ కొట్టేసిందని టాక్ నడుస్తోంది.

మరోవైపు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ ఈ మధ్య కాస్త అందాలు ఆరబోస్తూ ఫాలోవర్స్ ని పెంచుకునే పనిలో ఉంది. అయితే సాధారణంగా గ్లామర్ ఫోటో షూట్లతో అలరించే అనన్య.. ఈసారి తన ఫిట్‌నెస్ వీడియోతో ట్రెండింగ్ గా మారింది. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా కఠినమైన యోగా ఆసనాలను కూడా చాలా సులువుగా చేస్తూ పోస్ట్ చేసిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు అనన్యపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
అయితే సినిమా అవకాశాలతో బిజీగా ఉన్నప్పటికీ, తన వ్యక్తిగత ఆరోగ్యం కోసం సమయం కేటాయించడం పట్ల సినీ విశ్లేషకులు కూడా ప్రశంసిస్తున్నారు. మొత్తానికి అనన్య నాగళ్ల షేర్ చేసిన ఈ యోగా వీడియో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.












Click it and Unblock the Notifications