బోనమెత్తితే ‘కాఫిర్’ అయ్యిందా? తెలుగు హీరోయిన్ కన్నీటి సమాధానం వైరల్!
హైదరాబాద్‌లో ఇటీవల జరిగిన బోనావ వేడుకల్లో నటి ఫరియా అబ్దుల్లా పాల్గొనడం సోషల్ మీడియాలో తీవ్ర వివాదానికి దారితీసింది. సాంప్రదాయ దుస్తులు ధరించి శిరస్సుపై బోనం ఎత్తి ఆలయాన్ని సందర్శించిన ఫరియా అబ్దుల్లా అక్కడ భక్తులతో కలిసి డప్పు శబ్ధాలకు డ్యాన్స్ కూడా చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆమె ముస్లిం నేపథ్యాన్ని ప్రశ్నిస్తూ కొంత మంది నెటిజన్లు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వేరే మత సంప్రదాయాలను పాటించారంటూ ఆమెను 'కాఫిర్' అంటూ సంబోధిస్తూ దారుణంగా ట్రోల్ చేశారు.
తనపై వచ్చిన విమర్శలు, హేళనలపై ఫరియా అబ్దుల్లా సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ ఓ వీడియోను విడుదల చేశారు. తన కుటుంబ నేపథ్యాన్ని వివరిస్తూ.. తన తండ్రి సంజయ్ అబ్దుల్లా ఓ హిందూ కుటుంబంలో జన్మించారని.. ఇస్లాం సిద్ధాంతాలు నచ్చడంతో స్వచ్ఛందంగా ఆ మతాన్ని స్వీకరించారని వెల్లడించారు. రెండు వేర్వేరు సంప్రదాయాలు ఉన్న వాతావరణంలో పెరగడం వల్ల ఆధ్యాత్మికతను విశాల దృక్పథంతో అర్థం చేసుకునే అవకాశం తనకు లభించిందని.. వేరొక మత పండుగలో పాల్గొనడం అంటే తన సొంత మతాన్ని వదులుకోవడం కాదని స్పష్టం చేశారు.

తనను 'కాఫిర్' అని దూషించిన వారికి సముచిత రీతిలోనే సమాధానమిస్తూ.. తాను ద్వేషానికి ద్వేషంతో బదులు ఇవ్వబోనని నటి ఫరియా అబ్దుల్లా పేర్కొన్నారు. తనను వ్యతిరేకిస్తున్న వారికి కూడా మంచి జరగాలని ఆకాంక్షించారు. ప్రకృతిలోని చెట్లు, రాళ్లు, సీతాకోకచిలుకలలో కూడా దైవత్వాన్ని, సౌందర్యాన్ని చూస్తానని వెల్లడించారు. ప్రపంచంలోని అందం మానవులను దేవునికి దగ్గర చేయాలి కానీ విడదీయకూడదని అభిప్రాయపడిన ఫరియా.. ద్వేషించే వారిపై కూడా ప్రేమను కురిపించడమే తన తిరుగుబాటు, విప్లవమని పేర్కొన్నారు.
తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ 'అల్లాహ్' అనే పదానికి అర్థం ఏమిటని ఒకసారి తన తల్లిని అడగగా.. దాని అర్థం కాంతి అని.. ప్రతిచోటా, ప్రతి వస్తువులో ఒకే సమయంలో వ్యాపించి ఉండే పరమాత్మ' అని వివరించినట్లు ఫరియా అబ్దుల్లా చెప్పుకొచ్చారు. అలా సర్వవ్యాప్తమైన దైవత్వాన్ని వేరుచేసి చూడలేమని అన్నారు. మతం కంటే మానవత్వం, ప్రేమ, శాంతి అత్యున్నతమైనవని చాటి చెప్పిన ఫరియా అబ్దుల్లా ప్రకటన నెటిజన్లను విశేషంగా ఆలోచింపజేస్తోంది.
Faria Abdullah was hounded by religious extremists and quranists because she attended bonalu festival and she is crying very badly.
— Farzana Ali Mazari 🇮🇳 (@farzlicioustahe) August 15, 2026
This is how I feel everyday if I open my DMs or public DMs. People calling me different names and boycotting me from islam just because I stand… pic.twitter.com/MPzxDjBaG1














Click it and Unblock the Notifications