ఆ హీరోతో చీర కట్టించుకోవాలనుంది!
తెలుగు యాంకర్లలో ఒకరైన గీతా భగత్ సినిమా ఈవెంట్స్ తో బిజీగా ఉంటారు. ట్రైలర్ లాంచ్, టీజర్ లాంచ్, మూవీ ప్రెస్ మీట్స్ .. ఇలా అన్నింటికీ యాంకరింగ్ చేస్తుంటారు. మీడియం రేంజ్ చిత్రాల ఈవెంట్స్ కి ఎక్కువగా ఆమే కనిపిస్తూ ఉంటారు. వేదికపై తనదైన శైలిలో జోకులు వేస్తూ కార్యక్రమాన్ని చక్కగా నడిపిస్తుంటారు. సాధారణంగా సెలబ్రిటీలంతా పాల్గొనే వేడుకల్లో అతిథులతోపాటు యాంకర్లు చేసే కామెంట్లు కూడా వైరలవుతుంటాయి. అయితే కొన్ని కొన్ని సందర్భాల్లో వారు మాట్లాడే మాటలు ట్రోలింగ్ కు గురవుతుంటాయి.
యాంకర్లు సుమ, శ్రీముఖిలాంటివారు ఏదో చెప్పబోయి మరేదో చెప్పి వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. తాజాగా యాంకర్ గీతా భగత్ పై కూడా ట్రోలింగ్ జరిగింది. ఇటీవల రాజ్ తరుణ్ నటించిన భలే ఉన్నాడే చిత్ర టీజర్ లాంచ్ వేడుకలో కంటెంట్ ని ఇంప్రొవైజ్ చేయాలని ఆమె అనుకుంది. అయితే ఆ సందర్భం రాగానే బోల్డ్ గా మాట్లాడేసింది. భలే ఉన్నాడే సినిమా కథ టీజర్ ను బట్టి సిటీల్లో జరిగే వేడుకలకు మహిళలు చీర కట్టుకోవడంలో సాయం చేసే వ్యక్తిగా రాజ్ తరుణ్ నటిస్తున్నాడు. ఈ సీన్స్ లో టీజర్ లో రొమాంటిక్ గా, ఫన్నీగా చూపించారు.

రచయిత డార్లింగ్ స్వామి యాంకర్ గీతాని ఉద్దేశించి కామెంట్స్ చేశారు. ఇంత మాట్లాడుతున్నారు.. మీరెందుకు చీర కట్టుకుని రాలేదు అని ప్రశ్నించారు. అందుకు గీతా బదులిస్తూ.. నాకు హీరో రాజ్ తరుణ్ చేత చీర కట్టించుకోవాలని ఉంది అంటూ తన కోరికను బయట పెట్టింది. ఆమె మాటలకు అక్కడున్నవారంతా హాయిగా నవ్వేశారు. దీనిపై సోషల్ మీడియాలో గీతాభగత్ పై ట్రోలింగ్ జరిగింది. వైరలవడం కోసం నోటికి ఎంతొస్తే అది మాట్లాడితే వైరలవరని, పదిమంది ఉన్న చోట చూసుకొని మాట్లాడాలంటూ నెటిజన్లు కామెంట్లు పెట్టారు. హీరో చేత చీర కట్టించుకోవడం ఏమిటంటూ ప్రశ్నించారు. గతంలో కూడా గీతాభగత్ పై కొన్ని కాంట్రవర్సీలు ఉన్నాయి. కొన్ని వివాదాలు నడిచాయి.. పోలీసు కేసులు కూడా ఉన్నాయి.












Click it and Unblock the Notifications