ఆ తెలుగు దర్శకుడు రెండు నెలలు తనతో గడపమన్నాడు..హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
పని చేసే ప్రతిచోట అమ్మాయిలు అభద్రతా భావంతో ఉన్నారని ఇటీవల ఓ సర్వేలో తేలింది. ఇక సినిమా ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. సౌత్‌లో పోలిస్తే నార్త్‌లో హీరోయిన్స్‌కు, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లకు లైంగిక వేధింపులు అధికంగానే ఉంటాయి. కొందరు నటులు గతంలో తమకు ఎదురైన వేధింపులు గురించి బహిరంగంగానే చెబుతున్నారు. తమకు ఎదురైన లైంగిక వేధింపులు ,కాస్టింగ్ కౌచ్, కమింట్మెంట్‌ల గురించి హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు ఇటీవల పలు సందర్భాల్లో వెల్లడిస్తున్నారు.
కమిట్మెంట్ ఇచ్చినప్పటికీ ఆఫర్స్ రావడం లేదని ఇటీవలే ఓ తెలుగు నటి వెల్లడించారు. తాజాగా కాస్టింగ్ కౌచ్ గురించి బాలీవుడ్ ప్రముఖ నటి మితా వశిస్ట్ తన జీవితంలో ఎదురైన లైంగిక వేధింపుల గురించి వెల్లడించారు. కెరీర్ తొలినాళ్లలో కొందరు కాస్టింగ్ కౌచ్ గురించి పరోక్షంగా మాట్లాడేవారని తెలిపింది. కొందరు ఫోన్ చేసి మీటింగ్ ఉంది రమ్మని చెప్పేవారని.. కానీ అది అడిషన్ కాదని ముందే చెప్పేవారని తెలిపింది. అప్పట్లో ఆ ఫోన్ కాల్స్ గురించి అంతగా అర్థమయ్యేది కాదని.. ఫోన్ చేసి మీటింగ్ రమ్మంటారు.. కానీ అడిషన్ కాదంటున్నారేంటీ అంటూ సందీగ్దంలో పడిపోయేదాన్ని. ఎందుకో అక్కడికి వెళ్లాలనిపించేది కాదు. అందుకు ధైర్యం కూడా రాలేదు.

హీరోయిన్లకు లైన్‌లో పెట్టడానికి చాలామంది ట్రై చేయడం నేను ఇక్కడే చూశానని ఆమె చెప్పుకొచ్చారు. ఎంతోమంది ఆడవాళ్లు ఈ ప్రాబ్లమ్‌తో ఇబ్బంది పడుతున్నారని మితా వశిష్ఠ్ తెలిపారు. కెరీర్ తొలినాళ్లలో ఓ తెలుగు దర్శకుడు కమిట్మెంట్ అడిగాడని, నాకు ఫోన్ చేసి చెన్నైలోకలిసి లీడ్ రూల్‌లో అవకాశం ఇచ్చాడని తెలిపింది. కానీ అతడితో రెండు నెలలు కలిసి ఉండాలని కండిషన్ పెట్టాడని ఆమె పేర్కొంది. మొదట తన మాటలు అర్థం కాలేదని, తర్వాత మెల్లిగా అర్థం చేసుకుని.. నాకు ఎలాంటి రోల్ వద్దని చెప్పి అక్కడ నుంచి వచ్చేశానని ఆమె వెల్లడించారు. కొంతమంది కమిట్మెంట్ విషయంలో ఎదురుచెప్పి, ధైర్యంగా మాట్లాడిన వారికి ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఎదురకావు అని మితా వశిస్ట్ చెప్పుకొచ్చారు.












Click it and Unblock the Notifications