ఈ ముగ్గురిపైనే ఆధారపడ్డ తెలుగు ఇండస్ట్రీ భవిష్యత్తు?

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ప్రతి దర్శకుడు తనకంటూ ఓ అధ్యాయాన్ని లిఖించుకుంటున్నాడు. తాజాగా దర్శక ధీరుడు రాజమౌళి తెలుగు సినీ పరిశ్రమ కీర్తిని, ఖ్యాతిని ప్రపంచానికి పరిచయం చేశాడు. ప్రస్తుతం ఆయన మహేష్ బాబుతో పాన్ వరల్డ్ సినిమా చేయబోతున్నారు. రెండు భాగాలుగా వచ్చే అవకాశం ఉంది.

దుర్గా ఆర్ట్స్ పతాకంపై డాక్టర్ కెఎల్ నారాయణ దీన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా విడుదలవడానికి కనీసం మూడు సంవత్సరాల సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు. ఇది విడుదలైన తర్వాత రాజమౌళి నేరుగా తెలుగు సినిమా కాకుండా హాలీవుడ్ స్థాయిలో సినిమా తీసే అవకాశం ఉంది.

telugu film industry will depend these three directors

ప్రశాంత్ వర్మ, సుజిత్
దీంతో తెలుగులో ప్రస్తుతం యువ దర్శకులుగా ఉన్న ప్రశాంత్ వర్మ, సుజిత్, నాగ్ అశ్విన్ పైనే పరిశ్రమ ఆధారపడుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతానికి తెలుగులో ఈ ముగ్గురు దర్శకులు మల్టీ టాలెంట్ కలిగినవారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నాగ్ అశ్విన్ కల్కితో తన సత్తా మరోసారి చాటుకున్నారు. సుజిత్ పవన్ తో ఓజీ తీస్తున్నారు. ప్రశాంత్ వర్మ హనుమాన్ లాంటి ఘనవిజయాన్ని అందించి బాలకృష్ణ కొడుకును పరిచయం చేసే బాధ్యత తీసుకున్నారంటూ వార్తలు వస్తున్నాయి.

telugu film industry will depend these three directors

నాగ్ అశ్విన్ గురించి పరిచయం అవసరంలేదు
నాగ్ అశ్విన్ టాలెంట్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే తాను తీసిని సినిమాలు ఈ విషయాన్ని నిరూపిస్తున్నాయి. అలాగే ప్రశాంత్ వర్మతో సినిమాలు తీయడానికి బాలీవుడ్ హీరోలు కూడా మొగ్గుచూపారు. రణ్ వీర్ సింగ్ తో కథ ఓకే అయి చివరి నిముషంలో రద్దయింది. నానితో సుజిత్ ఓ సినిమా తీయబోతున్నారు.

telugu film industry will depend these three directors

భవిష్యత్తులో అనేక వండర్స్ ను వీరు క్రియేట్ చేయబోతున్నారని, ఇప్పుడు చేసిన సినిమాలతోపాటు చేయబోయే సినిమాల్లో ఒకటి హిట్ అయినా చాలని, పరిశ్రమలో వీరు ఎదగడమే కాకుండా తెలుగు పరిశ్రమకు కూడా మంచిపేరు తెచ్చిపెడతారని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+