పండగ సమయంలో థియేటర్లు ఇవ్వరా? మీ వ్యూహం ఏంటి?
తెలుగు సినీ పరిశ్రమలో మనకు తరుచుగా వినపడే పదం ఆ నలుగురు. మనిషి మరణించినప్పుడు మోయడానికి నలుగురు మనుషులు ఉండాలని అందరూ కోరుకుంటారు. మరి అదే నలుగురు ఇప్పుడేమైనా పరిశ్రమను మోస్తున్నారా? అంటే అదీ లేదు. టాలీవుడ్ కూడా కళకళలాడుతోంది. కానీ వీరు మాత్రం తమ విధానాలతో, తమ వ్యూహాలతో, లాభాల కోసం థియేటర్లను గుప్పిట పట్టారు. చిన్న సినిమాల సంగతి దేవుడెరుగు.. పెద్ద పెద్ద హీరోల సినిమాలకే థియేటర్లు ఇవ్వడంలేదు. ఒకవేళ ఇచ్చినా చాలా తక్కువ సంఖ్యలో ఇస్తారు. ఒక అగ్ర హీరో సినిమా తీసేసి మరో అగ్ర హీరో సినిమా ప్రదర్శించినప్పుడు ఇద్దరు హీరోల మధ్య విభేదాలు తలెత్తుతున్నాయి.
వారి నియంత్రణలోనే థియేటర్లు
వీరంతా సినిమా పంపిణీ రంగంలో ఏం చేస్తారంటే.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మంచి మంచి థియేటర్లను రెండేళ్లకు, ఐదేళ్లకు ఇంత చెల్లిస్తామని లీజుకు తీసుకుంటారు. మరికొందరు మాత్రం పాత థియేటర్లను తీసుకొని వాటిని కొత్తగా ఆధునికీకరించి మంచి థియేటర్లుగా మారుస్తారు. వారికి దగ్గరైనవారు, వారికి బాగా కావల్సినవారు, వారు కొన్న సినిమాలు, వారికి ఎక్కువగా లాభాలు రాగలవనుకున్న సినిమాలను వారి వారి థియేటర్లలో విడుదల చేస్తారు. సినిమా ఉన్నా లేకపోయినా ఆ థియేటర్లు మాత్రం వారి నియంత్రణలో ఉంటాయి.

హిట్ అయితే భారీ లాభాలు
చిన్న సినిమాలను తక్కువ రేటుకు కొని, తమ నెట్‌వర్క్ ఉపయోగించి విడుదల చేస్తారు. సినిమా హిట్ అయితే భారీ లాభాలు వస్తాయి. ఒకవేళ ఫ్లాప్ అయినా, థియేటర్లు తమవే కాబట్టి ఎగ్జిబిటర్ల నుంచి వచ్చే ఒత్తిడిని వారు తట్టుకోగలరు. పెద్ద హీరోల సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు, సంక్రాంతి పండగ సీజన్లలో ఇతర సినిమాలకు థియేటర్లు దొరకకుండా చేయడం అనేది వీరిపై తరచుగా వచ్చే విమర్శ. మేము రిస్క్ తీసుకుని కోట్లు పెట్టి సినిమా కొన్నప్పుడు మా సినిమాలకే ప్రాధాన్యత ఇచ్చుకుంటామని చెబుతుంటారు.
ఒక చిన్న సినిమాను విడుదల చేయాలంటే థియేటర్ యజమాని అడ్వాన్స్ అడుగుతాడు. అదే పెద్ద నిర్మాతలైతే థియేటర్ యజమానికి వారే అడ్వాన్స్ ఇస్తారు. ఎందుకంటే వీరి దగ్గర ఏడాది పొడవునా సినిమాలు ఉంటాయి కాబట్టి. చిన్న నిర్మాత ఒక్క సినిమాతో వచ్చి వెళ్ళిపోతాడు, అందుకే ఎగ్జిబిటర్లు రిస్క్ తీసుకోరు. ఆ నలుగురు కూడా చిన్న సినిమాలకు అధిక ప్రాధాన్యతనిస్తారు. ఎందుకంటే అందులో కనపడని లాభం వారికే తెలుసు.












Click it and Unblock the Notifications