పెళ్లి చేసుకొందామని కీర్తి సురేష్ ఇంటికి వెళ్లి మరీ అడిగిన తెలుగు హీరో
హీరోయిన్ కీర్తి సురేశ్ ఇటీవల కాలంలో ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు కీర్తి సురేష్. తెలుగు, తమిళ భాషల్లో టాప్ హీరోల సరసన నటిస్తూ స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలుగుతున్నారామె. ముఖ్యంగా 'మహానటి' సినిమాతో కీర్తి సురేశ్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఈ సినిమాలో కీర్తి సురేశ్ నటనకు విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు దక్కాయి.
కీర్తి సురేష్ ఎలాంటి పాత్రనైనా అవలీలగా పోషించగలదు. ఇటీవల కాలంలో కీర్తి సురేష్‌కు పెద్దగా హిట్లు లేకపోయినప్పటికీ బాగానే కెరీర్ లాగిస్తున్నారు. ఇప్పటి వరకూ కీర్తి సురేశ్ ఎలాంటి ఎక్స్‌పోజింగ్ , రొమాంటిక్ సీన్స్ చేయలేదు. స్టార్ హీరోయిన్‌గా మెలగాలంటే దానికి టాలెంట్, అదృష్టం కలిసి ఉంటే చాలని చెప్పిన కీర్తి సురేశ్ తనకంటూ ఒక మంచి స్థానాన్ని క్రియేట్ చేసుకుంది.అయితే ఇప్పుడు ఆ రూల్స్‌ను బ్రేక్ చేస్తూ రొమాంటిక్ సీన్స్ చేయడానికి గ్రీన్ ఇచ్చిందని తెలుస్తోంది.

ప్రస్తుతం కీర్తి సురేష్ చేతిలో అరడజనుకు పైగానే సినిమాలు ఉన్నాయి. గతేడాది కీర్తి బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. వరుణ్ ధావన్‌తో 'బేబీ జాన్'' అనే హిందీ సినిమాలో నటించింది. అయితే బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా అనుకున్నంత విజయాన్ని సొంతం చేసుకోలేకపోయింది. ఇక ఇటీవలే కీర్తి సురేశ్ పెళ్లి కూడా జరిగింది.ప్రియుడు ఆంటోనిని కీర్తి సురేశ్ వివాహం చేసుకుంది.
వీరి పెళ్లి ఘనంగా జరిగింది. డిసెంబర్ 12న అతి కొద్దిమంది సమక్షంలో కీర్తి సురేశ్ వివాహం జరిగింది.కాలేజ్ డేస్ నుంచే లవ్ స్టోరీ నడిపించిన కీర్తి తాను సినిమాల్లోకి వచ్చి స్టార్ హీరోయిన్ అయినా కూడా ఆ ప్రేమను కొనసాగించింది. తమ ప్రేమను పెళ్లిగా మార్చుకుంది కీర్తి సురేశ్.
అయితే కీర్తి సురేశ్‌ని తన కొడుక్కి ఇచ్చి వివాహం చేద్దామని అనుకున్నాడట ఓ హీరో తండ్రి. ఆ హీరో మరెవ్వరో కాదు..విశాల్. కీర్తి సురేశ్, విశాల్ ఇద్దరి కాంబినేషన్‌లో పందెం కోడి-2 సినిమా తెరకెక్కింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా మంచి విజయాన్ని నమోదు చేసింది. ఆ సినిమా షూటింగ్ సమయంలో కీర్తి సురేశ్‌ను చూసిన విశాల్ తండ్రి ఆమెతో తన కొడుకు వివాహం జరిగితే బాగుంటుందని భావించారట. ఈ విషయాన్ని దర్శకుడు లింగుస్వామికి చెప్పడంతో , ఆయన కీర్తి సురేశ్ ఇంటికి వెళ్లి విషయాన్ని తెలియజేశారట. అయితే అప్పటికే ప్రియుడు ఆంటోనిని తాను ప్రేమిస్తున్నానని ,అతన్నే పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో దర్శకుడు లింగుస్వామి నిరాశగా వెనుతిరిగారట.ఇక కీర్తి సురేశ్ చెప్పినట్టుగానే ప్రియుడు ఆంటోనిని వివాహం చేసుకుంది.












Click it and Unblock the Notifications