21 ఏళ్లకే పెళ్లి కాకుండానే తల్లైన తెలుగు హీరోయిన్
తెలుగు ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు ఉన్నారు. వారిలో ఇప్పటికిప్పుడు టాప్ హీరోయిన్ ఎవరంటే చెప్పడం కాస్తా కష్టమే. ఒక్కో హీరోయిన్‌లో ఒక్కో టాలెంట్ ఉంది.అయితే నేటితరం హీరోలతో సమానంగా డ్యాన్స్‌లు వేయగలిగిన హీరోయిన్స్ అతి కొద్దిమంది మాత్రమే ఉన్నారు.అలాంటి వారిలో శ్రీలీల మొదటి స్థానంలో ఉందనే చెప్పాలి.
గత రెండేళ్లలో ఆమె నటించిన సినిమాలు గ్యాప్ లేకుండా బాక్సాఫీస్‌పై దాడి చేశాయి. సీనియర్ దర్శకుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో పెళ్లి సందd సినిమాతో శ్రీలీల హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. శ్రీకాంత్ తనయుడు రోషన్ ఈ సినిమాలో హీరోగా పరిచియం అయ్యాడు. పెళ్లి సందd సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసింది.

ఈ సినిమా తర్వాత శ్రీలీల హీరో రవితేజతో జోడీగా 'ధమాకా' సినిమాలో నటించింది.ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. దీంతో శ్రీలీలకు వరుస ఆఫర్లు వెలువెత్తాయి. ఈ క్రమంలోనే స్కంద, భగవంత్ కేసరి,గుంటూరు కారం, ఎక్స్‌ట్రా-ఆర్డినరీ మ్యాన్ వంటి సినిమాల్లో శ్రీలీల నటించింది.
పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' , విజయ్ దేవరకొండ కొత్త సినిమాలో కూడా ఛాన్స్ కొట్టేసిన శ్రీలీల..తెలుగులో బిజీ హీరోయిన్‌గా మారింది. ఇదే సమయంలో తమిళంలో కూడా తన సత్తా చాటుతోంది ఈ అమ్మడు. ఇక ఇదే ఏడాది బాలీవుడ్‌లో కూడా ఎంట్రీ ఇవ్వడానికి అమ్మడు రెడీ అవుతోంది.స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ కొడుకు ఇబ్రహిం ఖాన్ ప్రస్తుతం 'దిలర్' మూవీ చేస్తున్నాడు.
ఇందులో శ్రీలీలని హీరోయిన్‌గా తీసుకున్నారనే టాక్ వినిపిస్తోంది. ఈ రెండు సినిమాలు హిట్ అయితే శ్రీలీల పంట పండినట్లే. ఇదెలా ఉంటే తాజాగా శ్రీలీల చేసిన ఓ పని అందర్ని ఆకట్టుకుంది. ఆమె
ఆమె ఒక అనాథాశ్రమాన్ని సందర్శించింది. అక్కడ పిల్లలు పడుతున్న కష్టాలను చూసి చలించిపోయింది. వెంటనే ఇద్దరు విభిన్న ప్రతిభావంతులైన పిల్లలు, గురు, శోభితలను దత్తత తీసుకుని వారికి మంచి జీవితాన్ని ప్రసాదించింది. ఈ విషయం తెలిసి అందరూ ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
చాలామంది దగ్గర డబ్బులు ఉంటాయి కానీ, అందరికి మంచి మనస్సు ఉండదని, ఇంత చిన్న వయస్సులోనే శ్రీలీల పిల్లల్ని దత్తత తీసుకుని తనలోని గొప్ప మనస్సును చాటుకుందంటూ ఆమెపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.












Click it and Unblock the Notifications