ఓటీటీలోకి తెలుగు బ్లాక్ బస్టర్ హారర్ మూవీ.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..!
హారర్, క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు మలయాళం ఇండస్ట్రీ పెట్టింది పేరు. వరుసగా హారర్ సినిమాలు తీస్తూ హిట్టు కొట్టడం అక్కడి హీరోలకే చెల్లుతుంది. మలయాళం ఇండస్ట్రీలో మోహన్ లాల్, ముమ్ముట్టి లాంటి స్టార్ హీరోలు కూడా టైమ్ దొరికితే చాలు హారర్ సినిమాలు చేస్తారు. ఇక మలయాళం హారర్, సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు అంటే తెలుగు ప్రేక్షకులు ఎగబడి చూస్తారు. ఓటీటీ మాధ్యమాలు పెరిగిపోయాక ఇప్పుడు ఏ సినిమా అయినా తెలుగులోనే ఇంట్లో కూర్చుని చూసే పరిస్థితి వచ్చింది. ఇక తెలుగులో హారర్, క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు తక్కువగా రిలీజ్ అవుతుంటాయి. వచ్చినా ఎప్పుడో ఒకటి వచ్చి వెళ్తుంది.
అయితే తెలుగులో హారర్ సినిమాలు హిట్ కావడం చాలా అరుదు. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చిన ప్రభాస్ రాజాసాబ్ మూవీ డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల టాలీవుడ్ యంగ్ హీరో సంగీత్ శోభన్ హీరోగా నటించిన చిత్రం 'రాకాస'.. మ్యాడ్ సిరీస్ తో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న ఈ కుర్ర హీరో రాకాస మూవీతో మరోసారి సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. 'కమిటీ కుర్రాళ్లు' లాంటి భారీ హిట్ తర్వాత నిహారిక కొణిదెల నిర్మించిన ఈ చిత్రం సూపర్ హిట్ అయింది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టి.. హారర్ కామెడీతోపాటు యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా ప్రశంసలు అందుకుంది.

ఇక తాజాగా 'రాకాస' మూవీ ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్.. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను భారీ ధరకు సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఈ నెలాఖరులో లేదా మే మొదటి వారంలో ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. ఇక దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక థియేటర్స్ లో మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న ఈ చిత్రం.. ఓటీటీలోనూ అదే రేంజ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో లేదో చూడాలి. ఈ మూవీలో సంగీత్ శోభన్ సరసన హీరోయిన్ గా నయన్ సారిక నటించింది.












Click it and Unblock the Notifications