రియల్ హీరో "శ్రీహరి" మరణానికి ఆ అలవాటే కారణం - సుద్దాల అశోక్
తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుల్లో శ్రీహరి ఒకరు. ఓ సాధారణ కుటుంబం నుంచి వచ్చిన ఆయన హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా.. పలు విభిన్న పాత్రలతో ప్రేక్షకులను మెప్పించి వారి మనసును గెలుచుకున్నారు. కేవలం నటుడిగానే కాకుండా.. ఆపత్కాలంలో ఎందరో పేదవారికి అండగా కూడా నిలిచారు. శ్రీహరి సహాయగుణం గురించి ఇప్పటికీ పలు వేదికల్లో ప్రముఖులు సైతం ప్రశంసలు కురిపించారు.
సినీ కెరీర్..
తొలుత స్టంట్ మాస్టర్‌గా కెరీర్‌ను ప్రారంభించిన శ్రీహరి.. 1989లో తమిళ చిత్రం "మా పిళ్ళై" ద్వారా తన సినీ ప్రయాణం ప్రారంభించారు. అదే ఏడాది తెలుగు సినిమా "ధర్మక్షేత్రం" ద్వారా తెలుగువారికి పరిచయమయ్యారు. ఆ తర్వాత విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తూనే.. "కుబుసం", "భద్రాచలం", "జూలీ", "అయోధ్య", "సైంధవుడు" వంటి అనేక చిత్రాలతో హీరోగా ప్రేక్షకులను అలరించారు. కానీ శ్రీహరికి ఇంకా బాగా పేరు తెచ్చింది అంటే.. వైవిధ్యమైన పాత్రలే అని చెప్పాలి.

అలానే "మగధీర" లో షేర్ ఖాన్ పాత్ర, "ఢీ" లోని సుబ్బరాజు పాత్ర, "నువ్వొస్తానంటే నేనొద్దంటానా", "బృందావనం", "తుఫాన్", "కింగ్" వంటి సినిమాల్లో ఆయన పాత్రలు సినిమాలకు కీలకంగా నిలిచాయి. అయితే కండలు తిరిగిన శరీరంతో ఉన్న శ్రీహరి ఒక్కసారిగా సన్నబడి మరణించడానికి గల కారణాన్ని గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ బయటపెట్టారు. దీంతో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.
సుద్దాల అశోక్ తేజ మాట్లాడుతూ... శ్రీహరి మృతికి ఆయనకు ఉన్న పాన్ తినే అలవాటే ప్రధాన కారణమని తెలిపారు. మేస్త్రి సినిమా సమయానికి శ్రీహరి ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందని.. అంతకుముందు 'భద్రాచలం' సినిమాలో ఎంతో పుష్టిగా, బలంగా కనిపించిన ఆయన... ఆ తర్వాత చాలా సన్నబడ్డారన్నారు. అతిగా పాన్ తినడం వల్లే ఆయన కాలేయం తీవ్రంగా దెబ్బతిందని.. అదే ఆయన మరణానికి దారితీసిందని మాకు తర్వాత తెలిసిందని ఆవేదన వ్యక్తం చేశారు.
అంతే కాకుండా శ్రీహరి కేవలం నటుడే కాదని.. తోటి కళాకారులను ఆదుకునే గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి అని సుద్దాల కొనియాడారు. ఒకానొక దశలో సినీ పరిశ్రమలో అవకాశాలు లేక, నిరాశతో తిరిగి తన పాత ఉద్యోగానికి వెళ్లిపోవాలనుకున్నప్పుడు.. శ్రీహరి చేసిన సహాయం మరువలేనిదని తెలిపారు. శ్రీహరి ఇచ్చిన ఆ ధైర్యమే 'భద్రాచలం' సినిమాలో అత్యంత ప్రజాదరణ పొందిన "ఒకటే జననం ఒకటే మరణం" పాటకు స్ఫూర్తి అని సుద్దాల తెలిపారు. తన చివరి శ్వాస వరకు పేదల కోసం, తోటి కళాకారుల కోసం పరితపించారని ఆయన కొనియాడారు.
-
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే! -
ఐ లవ్డ్ ధురంధర్ 1.. బట్ - జక్కన్న సెన్సేషన్ రివ్యూ: అలాంటి హీరోలందరినీ చంపేసింది -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
సొంత సినిమాను వదిలేసి పరాయి సినిమాకు భజనా? -
మెగా హీరో భార్యకు ఏమైంది?.. ఆ సీన్ చూస్తే దయ్యం పట్టినట్లే ఉంది! వీడియో -
ధురంధర్2, ఉస్తాద్ భగత్ సింగ్.. వీటిల్లో ఏ సినిమాకు వెళ్లాలి? -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
దురంధర్-2కు బిగ్ షాక్.. ఆన్లైన్లో ప్రత్యక్షమైన ప్రింట్! -
రూ. 2 వేల కోట్ల బొమ్మ.. "ధురంధర్ - ది రివెంజ్" రివ్యూ.. ఇది సార్ సినిమా అంటే !! -
అనుష్క పెళ్లి ట్విస్ట్: ఆ విషయాన్ని ఎందుకు హైలైట్ చేస్తున్నారు? -
తెలంగాణ గద్దర్ అవార్డుకు ఎంపికైన తొలి బయోపిక్ ఇదే.. స్పెషాలిటీ అదే !! -
‘ధురంధర్2’లో హైలైట్స్ ఇవే.. దద్ధరిల్లుతున్న థియేటర్లు












Click it and Unblock the Notifications