రామ్ చరణ్ బ్యాడ్ లక్.. అల్లు అర్జున్ బ్లాక్ బస్టర్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమాతో బిజీగా ఉన్నారు. దీంతోపాటు తన 16వ సినిమాగా బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమా రాబోతోంది. దీనికి సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా ఇటీవలే జరిగాయి. దీనితర్వాత సుకుమార్ దర్శకత్వంలో తన 17వ సినిమాను చేయబోతున్నారు. అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప2 చిత్రం చేస్తున్నారు. దీనిపై దేశవ్యాప్తంగా విపరీతమై క్రేజ్ నెలకొంది. ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీన విడుదల చేయబోతున్నారు. దాదాపు రూ.400 నుంచి రూ.450 కోట్ల బడ్జెట్ తో రూపొందిస్తున్నారు. రూ.వెయ్యి కోట్ల వసూళ్లు కొల్లగొట్టాలనే టార్గెట్ పెట్టుకున్నారు.
అల్లు అర్జున్ కథానాయకుడిగా పరిచయమైన మొదటి చిత్రం గంగోత్రి. కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా పెద్ద మ్యూజికల్ హిట్ గా నిలిచింది. వాస్తవానికి ఈ సినిమాలో అల్లు అర్జున్ కన్నా ముందుగా రామ్ చరణ్ చేత నటింపచేయాలనుకున్నారు. అయితే అప్పటికే చెర్రీ ఎటువంటి నటన నేర్చుకోలేదు.. ఫిల్మ్ యాక్టింగ్ కు సంబంధించి శిక్షణ తీసుకోవాల్సి ఉందని, అందుకు ఎంతో సమయం కూడా పడుతుందని చిత్ర యూనిట్ కు చిరంజీవి చెప్పారు. బన్నీ అయితే బాగుంటుందని, తనతో తీయాలని కోరడంతో బన్నీని పెట్టి రాఘవేంద్రరావు, అశ్వనీదత్ గంగోత్రి తీశారు. ఈ సినిమా సూపర్ హిట్ అయింది.

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా చిరుత వచ్చింది. అయితే అది ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. తర్వాత మగధీరతో బ్లాక్ బస్టర్ ను రామ్ చరణ్ తన ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం గేమ్ ఛేంజర్ షూటింగ్ లో చెర్రీ ఉండగా, అల్లు అర్జున్ పుష్ప2 షూటింగ్ లో ఉన్నారు. ఈ రెండు సినిమాలు పాన్ ఇండియా సినిమాలుగానే రాబోతున్నాయి. అంచనాలు కూడా భారీగా ఉన్నాయి. వీటి విజయాన్ని బట్టి వీరి తర్వాత ప్రాజెక్టుల బడ్జెట్ ఆధారపడివుంటుంది.












Click it and Unblock the Notifications