కొత్త సంవత్సరం నాడు గుడ్ న్యూస్ చెప్పిన స్టార్ హీరోయిన్..?

ఇప్పుడైతే రోజుకో హీరోయిన్ టాప్ ప్లేస్‌లో ఉంటున్నారు కానీ, ఒకనొక సమయంలో ఇలియానా దశాబ్ద కాలం పాటు తెలుగు ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్‌గా నిలిచి రికార్డ్ క్రియేట్ చేసింది. రామ్ హీరోగా నటించిన ''దేవదాసు'' సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఇలియానా, అనతి కాలంలోనే స్టార్ హీరయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. రెండో సినిమానే మహేష్ బాబు వంటి సూపర్ స్టార్‌తో నటించే అవకాశం దక్కించుకుంది. ''పోకిరి'' సినిమాతో ఇలియానా కెరీర్ ఒక్కసారిగా మారిపోయింది. ఆ తర్వాత స్టార్ హీరోల సినిమాల్లో నటించి ఫుల్ పాపులారిటీ తెచ్చుకుంది.

ఎన్టీఆర్, పవన్ కల్యాణ్, ప్రభాస్ , అల్లు అర్జున్ వంటి హీరోల సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్‌గా నిలిచింది. ఇలియానా పేరు చెప్పగానే అందరికీ ఆమె నడుమే గుర్తుకు వస్తుంది. ఎవరినైనా పొగిడే సమయంలో అచ్చం నీ నడుము ఇలియానాలా ఉంది అని అంటూ ఉంటారు.అంత ఫేమస్ అయింది ఇలియానా నడుము. కోటి రూపాయిలు పారితోషకం అందుకున్న తొలి హీరోయిన్‌గా ఇలియానా చరిత్ర సృష్టించింది. అంతలా ఆమె క్రేజ్ ఉండేది. అయితే ఇలియానా నటించిన సినిమాలు ఫెయిల్ కావడం, ఇదే సమయంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వడంతో ఇలియానాకు ఆఫర్లు ఒక్కసారిగా తగ్గిపోయాయి.

telugu satr heroine pregnant for the second time

దీంతో బాలీవుడ్ బాటపట్టి అక్కడ తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. అక్కడ కూడా అమ్మడకు నిరాశే ఎదురైంది.ఇదే సమయంలో ఇలియానా పెళ్లి చేసుకుని అందరికి షాకిచ్చింది.ఇలియానా తన ప్రియుడు మైఖేల్‌ డోలన్‌ను కొంతకాలం క్రితం రహస్యంగా పెళ్లి చేసుకుంది. 2023లో కుమారుడు పుట్టిన తర్వాత మైఖేల్‌తో ఫోటోను మొదటిసారిగా షేర్‌ చేసింది. తాజాగా అమ్మడు మరోసారి తల్లి కాబోతుందనే వార్త నెట్టింట వైరల్‌గా మారింది. ఇలియానా ఇటీవల షేర్ చేసిన ఫొటోల్లో పొట్ట దగ్గర ఎత్తుగా కనిపించడంతో ఆమె మరోసారి తల్లి కాబోతుందంటూ ప్రచారం జరుగుతోంది. అయితే ప్రెగ్నెన్సీ వార్తలపై ఇలియానా స్పందించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+